Perni Nani : సమ్మె వద్దు.. చెప్పుడు మాటలు వినొద్దు, జగన్ చాలా బాధపడుతున్నారు

ఉద్యోగుల ఆందోళనలు క్యాష్ చేసుకోడానికి కొందరు గోతికాడ నక్కలా చూస్తున్నారు. ఎవరో చెప్పిన మాటలు నమ్మి భావోగ్వేదానికి గురై సమ్మె నిర్ణయం తీసుకోవద్దు.

Perni Nani : సమ్మె వద్దు.. చెప్పుడు మాటలు వినొద్దు, జగన్ చాలా బాధపడుతున్నారు

Perni Nani

Perni Nani : ఏపీ ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలపై ఏపీ మంత్రి పేర్నినాని స్పందించారు. ఉద్యోగులు వాస్తవ పరిస్థితులు అర్ధం చేసుకోవాలని మంత్రి కోరారు. ఎవరో చెప్పిన మాటలు నమ్మి భావోగ్వేదానికి గురై సమ్మె నిర్ణయం తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల పట్ల సానుభూతి లేకపోతే అధికారంలోకి రాగానే 27శాతం ఐఆర్ ఎందుకు ఇస్తారు..? అని మంత్రి అడిగారు. ఉద్యోగులను కన్నబిడ్డలా చూసుకోవాలని జగన్ ప్రభుత్వం అనుకుంటుందన్నారు. మీ కోరికలు తీర్చలేకపోతున్నందుకు సీఎం జగన్ చాలా బాధ పడుతున్నారని మంత్రి చెప్పారు.

Fever : జ్వరంతో బాధపడుతుంటే మాంసాహారం తినకూడదా?

ఇలాంటి సందర్భంలో కొంతమంది.. రాజకీయ లబ్ది కోసం మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. ఉద్యోగుల ఆందోళనలు క్యాష్ చేసుకోడానికి కొందరు గోతికాడ నక్కలా చూస్తున్నారని, ఉద్యోగుల పట్ల మొసలి కన్నీళ్లు కారుస్తున్న వారు గతంలో మిమ్మల్ని ఎలా చూశారో ఆలోచించుకోవాలని మంత్రి పేర్ని నాని అన్నారు.

”టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఐదేళ్లు పాలించి ఒక్క ప్రభుత్వ ఉద్యోగం అయినా ఇచ్చారా..? కోవిడ్ తో వ్యవస్థ మొత్తం తల్లడిల్లుతోంది. 2020 లో రూ.62వేల కోట్లు ఆదాయం రావాల్సి ఉంటే రూ.60వేల కోట్లు వచ్చింది. 2021 లో రూ.82వేల కోట్లు రావాల్సి ఉంటే రూ.60వేల కోట్ల రాబడి వచ్చింది. కోవిడ్ కట్టడి కోసం ఇప్పటివరకు రూ.30వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. కేంద్రం నుండి రావాల్సిన వాటాలు భారీగా పడిపోతున్నాయి. కొత్త పీఆర్సీ వల్ల రూ.10 వేల కోట్లు అధికంగా చెల్లింపులు పెరిగాయి” అని మంత్రి పేర్ని నాని అన్నారు.

Blood Clots : గుండె రక్త నాళాల్లో పూడికలు….ఎవరిలో ఎక్కువంటే?

”సమ్మె నిర్ణయం ఉద్యోగుల హక్కు.. మేము ఆలోచన చెయ్యమని అడుగుతున్నాం.. ఆవేశంలో నిర్ణయం తీసుకోవద్దని చెబుతున్నాం. చర్చలకు ఎప్పుడు వచ్చినా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చంద్రబాబు లాఠీలతో కొట్టించిన దెబ్బలు ఉద్యోగులు మర్చిపోలేదు. చంద్రబాబు ప్రభుత్వం వేధించినంతగా ఏ ప్రభుత్వం ఉద్యోగులను హింసించ లేదు. సీపీఎస్ రద్దు కోరుతూ ఆందోళన చేసిన ఉద్యోగులపై క్రిమినల్ కేసులు పెట్టలేదా? చంద్రబాబు పెట్టిన కేసుల్ని మా ప్రభుత్వం వచ్చాక ఎత్తేశాం. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. అక్కడ కేంద్రం పీఆర్సీ, హెచ్ఆర్ఏ అమలు చేస్తున్నారో.. లేదో.. రాష్ట్ర బీజేపీ నేతలు చెక్ చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలయ్యేవి కేంద్ర ఉద్యోగులకు ఇవ్వమని జీవీఎల్ చెప్పాలి” అని మంత్రి పేర్ని
నాని అన్నారు.