Nepal Plane Crash: విమాన ప్రమాదంలో చనిపోయిన కో పైలెట్ అంజూ ఏపీలోనే చదువుకుందా.. ఏ కాలేజీలోనో తెలుసా..?

నేపాల్‌లోని విమాన ప్రమాదంలో మరణించిన కో పైలెట్ అంజూ ఖాతీవాడకు ఆంధ్రప్రదేశ్‌తో అవినాభావ సంబంధం ఉంది. ఆమె రెండేళ్లపాటు ఇక్కడే విద్యనభ్యసించారు. 1995లో గుంటూరు జిల్లా తెనాలిలోని వివేకానంద జూనియర్ కాలేజీలో ఆమె ఇంటర్మీడియట్‌లో సుమారు రెండు సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు.

Nepal Plane Crash: విమాన ప్రమాదంలో చనిపోయిన కో పైలెట్ అంజూ ఏపీలోనే చదువుకుందా.. ఏ కాలేజీలోనో తెలుసా..?

Anju Khatiwada

Updated On : January 16, 2023 / 8:10 PM IST

Nepal Plane Crash: నేపాల్‌లోని పొఖారాలో విమాన ప్రమాదం జరిగిన విషయం విధితమే. ఈ ప్రమాదంలో విమానం మంటల్లో పూర్తిగా దగ్దమైంది. ప్రమాద సమయంలో విమానంలో 72 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది. ఇప్పటివరకు 68 మంది మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది గుర్తించినట్లు తెలిసింది. మరో నలుగురి మృతదేహాల కోసం గాలిస్తున్నారు. వీటిలో ఒకరిది యతి ఎయిర్ లైన్స్ కో పైలెట్ అంజూ ఖాతీవాడ. ఆమె మృతదేహం ఇంకా లభ్యంకాలేదు. అయితే, ఆమె మరణించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

Nepal Plane Crash : నేపాల్ విమాన ప్రమాదంలో గుండెలు పిండే మరో విషాదం.. టిక్ టాక్ వీడియో చేసిన కాసేపటికే దుర్మరణం

కో పైలెట్ అంజూ ఖాతీవాడ భర్తకూడా పైలెట్. ఆయనసైతం యతి ఎయిర్‌లైన్స్‌లో పైలెట్ గా పనిచేస్తూ 2006లో జరిగిన ప్రమాదంలో మరణించాడు. అప్పటి నుంచి అంజూ ఖాతీవాడ శిక్షణ తీసుకొని యతి ఎయిర్ లైన్స్‌లోనే కో పైలెట్‌గా పనిచేస్తుంది. అంజూకు 44ఏళ్లు. ఆమెకు పూర్తిస్థాయి పైలెట్ గా గుర్తింపు తెచ్చుకోవాలని కోరిక. ఈ క్రమంలో ఆమె ఎక్కువ సమయం కో పైలెట్ గా విమానంలో ప్రయాణించాలని కోరుకునేది. ఆదివారం ప్రమాదం జరిగిన విమానంలోకూడా వేరే కో పైలెట్ స్థానంలో అంజూ వెళ్లినట్లు తెలిసింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Nepal Plane Crash: ఒకప్పటి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ విమానమే.. నేపాల్‌లో ప్రమాదానికి గురైన విమానం ..

అయితే, కో పైలెట్ అంజూ ఖాతీవాడకు ఆంధ్రప్రదేశ్‌తో అవినాభావ సంబంధం ఉంది. ఆమె రెండేళ్లపాటు ఇక్కడే విద్యనభ్యసించారు. 1995లో గుంటూరు జిల్లా తెనాలిలోని వివేకానంద జూనియర్ కాలేజీలో ఆమె ఇంటర్మీడియట్ లో సుమారు రెండు సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు. ఈ కాలేజీలో నేపాలీ విద్యార్థులు ఎక్కువగా విద్యనభ్యసిస్తుంటారు. అంజూ ఇక్కడ చదువుకున్న సమయంలో శివ మకుటం ఆమె బ్యాచ్‌మెట్‌గా ఉన్నారు. ఈ విషయాన్ని అతను తెలిపారు. అప్పట్లో వివేకానంద కాలేజీలో అమ్మాయిల క్యాంపస్ లో అంజూ, అబ్బాయిల క్యాంపస్ లో నేను చదువుకున్నామని తెలిపాడు. అంజూ ఎప్పుడూ మాతో టచ్ లోనే ఉంటుందని, మా కాలేజ్ వాట్సాప్ గ్రూపులో కూడా ఆమె యాక్టివ్‌గా ఉంటుందని శివ తెలిపారు.

Nepal Plane Crash: నేపాల్‌లో విమానం కూలేముందు ఏం జరిగిందంటే.. వీడియో వైరల్..

అంజూ ఎప్పుడూ నాతో టచ్ లోనే ఉంటారు. ప్రమాదంకు ముందు రోజు పైలెట్ గా 12ఏళ్లు పూర్తిచేసుకున్నట్లు నాకు ఫేస్ బుక్ ద్వారా మెసేజ్ పంపారు. ఈ మధ్యనే నేపాల్ రావాలంటూ నన్ను ఆమె పిలిచారు. ఎవరెస్ట్ పర్వతం మీద విమానంలో తిప్పుతానని చెప్పారు. నేనుకూడా త్వరలోనే అక్కడికి వెళ్లి వారి కుటుంబాన్ని కలుద్దామని అనుకున్నా.. కానీ, ఇంతలోనే ఇలా జరిగిపోయింది అని శివ మకుటం తన ఫేస్‌బుక్‌లో రాశారు.

Siva makuram Facebook

Siva makuram Facebook