Nepal Plane Crash: ఒకప్పటి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ విమానమే.. నేపాల్‌లో ప్రమాదానికి గురైన విమానం ..

నేపాల్ చెకర్డ్ ఏవియేషన్ చరిత్రలో ఇలాంటి మోడల్ ప్రమాదానికి గురికావడం ఇదే మొదటిసారి. ఏటీఆర్ -72 అనేది ట్విన్ ఇంజిన్ టర్బోప్రాప్, విమానాల తయారీదారు ఏటీఆర్ ద్వారా ప్రాన్స్, ఇటలీలో అభివృద్ధి చేయబడిన స్వల్ప దూర ప్రాంతీయ విమానం. ఇది ఫ్రెంచ్ ఏరోస్పేస్ కంపెనీ ఏరో స్పేషియేల్, ఇటాలియన్ ఏవియేషన్ సమ్మేళనం ఎరిటాలియా మధ్య జాయింట్ వెంచర్.

Nepal Plane Crash: ఒకప్పటి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ విమానమే.. నేపాల్‌లో ప్రమాదానికి గురైన విమానం ..

Kingfisher Airlines

Nepal Plane Crash: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయ విధితమే. యతి ఎయిర్‌లైన్స్‌కు చెంది 9ఎన్-ఏఎన్సీ ఏటీఆర్-72 విమానం ఆదివారం ఉదయం 10.33గంటలకు ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. పొఖారాలోని నూతన విమానాశ్రయంలో సేతి నదిఒడ్డున ల్యాండింగ్ సమయంలో కూలిపోయిన విషయం విధితమే. ఈ ప్రమాద సమయంలో విమానంలో 72 మంది ఉన్నారు. వీరిలో 68 మంది ప్రయాణికులు కాగా, నలుగురు విమాన సిబ్బంది. అయితే, ఇప్పటి వరకు 68మంది మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. మరో నలుగురు గల్లంతయ్యారు. వారికోసం గాలిస్తున్నారు. మృతుల్లో ఐదుగురు భారతీయులు ఉన్నారు.

Nepal Plane Crash: నేపాల్‌లో విమానం కూలేముందు ఏం జరిగిందంటే.. వీడియో వైరల్..

ఇదిలాఉంటే నేపాల్‌లో ప్రస్తుతం కూలిన యతి విమానం గతంలో విజయ్ మాల్యాకు కంపెనీ కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఉపయోగించిందని సిరియమ్ ఫ్లీట్స్ డేటా తెలిపింది. 9ఎన్-ఏఎన్సీ విమానం 2007లో ప్రస్తుతం మూతపడిపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు వినియోగించింది. ఆరేళ్ల తరువాత దీనిని థాయ్‌లాండ్ కు చెందిన నోక్ ఎయిర్ లైన్స్ కొనుగోలు చేసింది. మరళ దీనిని 2019లో నేపాల్‌కు చెందిన యతి ఎయిర్‌లైన్స్ కొనుగోలు చేసింది. సిరియమ్ ప్లీట్స్ డేటా ప్రకారం.. ఈ విమానం లీజర్ ఇన్వెస్టెక్ బ్యాంక్ ద్వారా నిర్వహించబడుతుందని, కేఎఫ్ టర్బో లీజింగ్ యాజమాన్యంలో ఉందని పేర్కొంది.

Nepal Plane Crash History : నేపాల్ లో అనేక విమాన ప్రమాదాలు.. ఎన్ని విమానాలు కుప్పకూలాయి? ఎంత మంది చనిపోయారు?

నేపాల్ చెకర్డ్ ఏవియేషన్ చరిత్రలో ఇలాంటి మోడల్ ప్రమాదానికి గురికావడం ఇదే మొదటిసారి. ఏటీఆర్ -72 అనేది ట్విన్ ఇంజిన్ టర్బోప్రాప్, విమానాల తయారీదారు ఏటీఆర్ ద్వారా ప్రాన్స్, ఇటలీలో అభివృద్ధి చేయబడిన స్వల్ప దూర ప్రాంతీయ విమానం. ఇది ఫ్రెంచ్ ఏరోస్పేస్ కంపెనీ ఏరో స్పేషియేల్, ఇటాలియన్ ఏవియేషన్ సమ్మేళనం ఎరిటాలియా మధ్య జాయింట్ వెంచర్. ప్రస్తుతం నేపాల్ లో బుద్ధ ఎయిర్, యతి ఎయిర్ లైన్స్ మాత్రమే ఏటీఆర్ -72 విమానాలను ఉపయోగిస్తున్నాయి.