Perni Nani: సినిమా టిక్కెట్ ధరల తగ్గింపుపై మంత్రితో డిస్ట్రిబ్యూటర్ల భేటీ
కొద్ది వారాలుగా ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ల ధరల విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు మంత్రితో భేటీ కానున్నారు. సీనియర్ డిస్ట్రిబ్యూటర్లు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు...

Perni Nani
Perni Nani: కొద్ది వారాలుగా ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ల ధరల విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు మంత్రితో భేటీ కానున్నారు. సీనియర్ డిస్ట్రిబ్యూటర్లు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో చర్చించనున్నారు. టిక్కెట్ ధరలు తగ్గించడం వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యత్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోరనున్నారు.
థియేటర్లలో జరుగుతున్న వరుస తనిఖీల అంశంపైనా చర్చించనున్నారు. 20 మంది డిస్ట్రిబ్యూటర్ లు ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారు. సీఎం వరకూ తమ సమస్యలను వినిపించాలని కోరనున్నారు. 200 సినిమా థియేటర్లు మూతపడటం వల్ల సమస్యలు ఏర్పడ్డాయని మార్పులు చేపట్టాలని అడగనున్నారు.
ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరల పరిశీలనకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.