Mylavaram : మైలవరానికి వసంత.. పెడనకు జోగి…స్పష్టం చేసిన పెద్దిరెడ్డి

కృష్ణాజిల్లా మైలవరం నియోజక వర్గంలో వైసీపీ లో బయట పడ్డ విభేదాలపై పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా ఇంచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్పందించారు.

Mylavaram : మైలవరానికి వసంత.. పెడనకు జోగి…స్పష్టం చేసిన పెద్దిరెడ్డి

Mylavaram YCP

Updated On : January 4, 2022 / 12:19 PM IST

Mylavaram :  కృష్ణాజిల్లా మైలవరం నియోజక వర్గంలో వైసీపీ లో బయట పడ్డ విభేదాలపై పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా ఇంచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్పందించారు. మైలవరం నియోజకవర్గం‌లో ప్రస్తుతం వసంత కృష్ణ ప్రసాదే ఎమ్మెల్యేగా ఉన్నారని…. భవిష్యత్తులో కూడా ఆయనే పార్టీ అభ్యర్థిగా ఉంటారని స్పష్టం చేశారు.

వసంత కృష్ణ ప్రసాద్‌కు వ్యతిరేకంగా పని చేస్తే పార్టీకి వ్యతిరేకంగా పని చేసినట్టే అని…..అలాంటి వారిపై పార్టీలో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.  జోగి రమేష్ పెడన ఎమ్మెల్యేగా ఉన్నారు… ఆయన అక్కడ కొనసాగుతారు… వారిద్దరి మధ్య అనవసర విభేదాలు సృష్టిస్తే ఉరుకొమని ఆయన తెలిపారు.

అలా ఎవరైనా చేస్తే వారిని పార్టీ నుండి బయటకు పంపేందుకు కూడా వెనుకాడమని పెద్ది రెడ్డి చెప్పారు. అందరూ కలిసి మెలిసి పని చేస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని….అనవసర వివాదాలకు దారితీసే చర్యలు ఉపసంహరించాలని కార్యకర్తలకు హితవు చెప్పారు.