ఆఫీసులకు వెళ్లే వారు చేయాల్సినవి, చేయకూడని పనులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. భారతదేశంలో కూడా కరోనా స్పీడుగా వ్యాపిస్తోంది. దీంతో లక్షలాది మంది వైరస్ బారిన పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో అత్యధికంగా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో షాపింగ్ మాల్స్, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతరత్రా దుకాణాలు తెరుచుకున్నాయి. అయితే..ప్రధానంగా ఆఫీసులకు వెళ్లే వారు అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు…అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు కార్యాలయాల్లో చేయాల్సిన, చేయకూడని పనుల జాబితాను రూపొందించింది.
చేయకూడనివి : –
* జ్వరం, దగ్గు, తుమ్ములు లాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వారిని దగ్గరగా ఉంచవద్దు. * ఆహారం, పాత్రలు, కప్పులు, టవల్స్, నీటి బాటిల్స్ తదితర వాటిని ఇతరులతో పంచుకోవద్దు. * లిఫ్ట్ బటన్లు తాకడానికి ఎడమ చేయి లేదా మోచేతిని వాడాలి. * లిఫ్ట్ లను ఉపయోగించకపోవడమే బెటర్. * ACని వీలైనంత వరకు వాడకపోవడం మంచిది. * పని చేసే ఉద్యోగులు కనీసం 3 అడుగులు, వీలైతే..6 అడుగుల దూరంగా ఉండాలి. * సమావేశాలను వీలైనంతగా ఆన్ లైన్ లో నిర్వహించాలి. * బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ఉపయోగించవద్దు.
చేయాల్సినవి : –
* ఎవరైనా తమ్మినప్పుడు, దగ్గినప్పుడు కర్చీఫ్, టిష్యూ పేపర్, ఇతరత్రా వాటిని అడ్డుపెట్టుకోవాలి. * టేబుళ్లు, డోర్ హ్యాండిళ్లు, వాటర్ ట్యాప్ లాంటివి రోజుకు 3 నుంచి నాలుగుసార్లు లైజాల్ లేదా సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో శుభ్రం చేయాలి. * మాస్క్ తప్పనిసరిగా ధరించి రావాలి. * జ్వరం, దగ్గు, జలుబు ఉన్న వారు ఇంటి వద్దనే ఉండి రెస్ట్ తీసుకోవాలి. * శానిటైజర్లు అందరికీ అందుబాటులో ఉంచాలి. * రోజు కార్యాలయానికి వచ్చే వారి టెంపరేచర్స్ తప్పనిసరిగా తనిఖీ చేయాలి. * పేపర్లు, ఫైల్స్, డబ్బులు వంటివి తాకిన ప్రతిసారి చేతులు కడుక్కోవాలి.
Read: కరోనాతో ఏపీలో 77.04 శాతం చనిపోయింది వాళ్లే.. బయటకు రావద్దు..