Chittoor : మద్యం వద్దన్నందుకు.. రక్తదాహం తీర్చుకున్నాడు

చిత్తూరు జిల్లా మదనపల్లేలో దారుణం జరిగింది. శాడిస్టు భర్త ఘాతుకానికి పాల్పడ్డాడు.. మద్యం తాగోద్దన్నందుకు భార్యపై కత్తితో దాడి చేశాడు.

Chittoor : మద్యం వద్దన్నందుకు.. రక్తదాహం తీర్చుకున్నాడు

Chittoor

Updated On : November 17, 2021 / 9:43 PM IST

Chittoor : చిత్తూరు జిల్లా మదనపల్లేలో దారుణం జరిగింది. శాడిస్టు భర్త ఘాతుకానికి పాల్పడ్డాడు.. మద్యం తాగోద్దన్నందుకు భార్యపై కత్తితో దాడి చేశాడు. విచక్షణ రహితంగా కత్తితో దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. మహిళ కేకలు విన్న స్థానికులు ఆమెను భర్త నుంచి రక్షించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

చదవండి : HYD Crime : గచ్చిబౌలిలో దారుణం.. తండ్రిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన కొడుకు

ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు.. ఆరోగ్యపరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

చదవండి : Hyd Crime : హైదరాబాద్‌లో దారుణం.. ప్రేమకు అడ్డుచెప్పిన తండ్రి.. హత్యచేసిన బాలిక