పోలింగ్ ఎఫెక్ట్ : రెండు రోజులు మందు బంద్
తెలంగాణ, ఏపీలో మైకులు మూగబోయాయి. ఎన్నికల ప్రచారం ముగిసింది. ఏప్రిల్ 11వ తేదీన తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు, ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి.

తెలంగాణ, ఏపీలో మైకులు మూగబోయాయి. ఎన్నికల ప్రచారం ముగిసింది. ఏప్రిల్ 11వ తేదీన తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు, ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి.
తెలంగాణ, ఏపీలో మైకులు మూగబోయాయి. ఎన్నికల ప్రచారం ముగిసింది. ఏప్రిల్ 11వ తేదీన తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు, ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. నగదు, మద్యంతో ఓటర్లను ప్రలోభపెట్టి రాజకీయ నాయకులు ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు.. లిక్కర్ షాపులు బంద్ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో.. ఏప్రిల్ 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి తెలంగాణలో, సాయంత్రం 6 గంటల నుంచి ఏపీలో మద్యం షాపులు మూసివేశారు.
Read Also : తెలంగాణలో మైకులు మూగబోయాయి
ఈసీ ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ దుకాణాలపై నిఘా పెట్టింది. ఓటర్లను ప్రలోభపెట్టకుండా టీమ్స్ ఏర్పాటు చేసింది. మళ్లీ ఏప్రిల్ 11వ తేదీ పోలింగ్ ముగిసిన తర్వాత.. సాయంత్రం 6 గంటల తర్వాత మద్యం షాపులు ఓపెన్ కానున్నాయి. రెండు రోజులు షాపులు మూసివేస్తారనే ముందస్తు సమాచారంతో.. పార్టీలు, నేతలు అలర్ట్ అయ్యారు. ముందుగానే స్టాక్ పెట్టుకున్నారు. మరికొందరు అయితే టోకెన్ల రూపంలో స్టాక్ పెట్టుకున్నారు. వైన్ షాపులతోపాటు బార్లు, త్రీస్టార్ హోటళ్లలోనూ లిక్కర్ సేల్స్, సరఫరా నిలిపివేశారు.
రూల్స్ బ్రేక్ చేసి మద్యం అమ్మకాలు చేస్తే లైసెన్స్ రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది ఈసీ. కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్, పోలీసు అధికారులు హెచ్చరించారు. బెల్టుషాపుల్లో విక్రయిస్తే జైలు శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు అధికారులు.
Read Also : ఏపీలో మైక్ లు బంద్…ఓటరు దేవుడు ఎవరివైపు