EVMలు బాగా పని చేస్తున్నాయ్.. తప్పుడు వార్తలు నమ్మొద్దు : ఈసీ ద్వివేదీ

సాయంత‌్రం 6 లోపు పోలింగ్ బూత్ లో ఉండి, ఓటర్ల లిస్టు లో పేరు ఉన్నవాళ్లందరికీ  ఓటు హక్కు కల్పిస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ  ద్వివేది చెప్పారు.

  • Published By: chvmurthy ,Published On : April 11, 2019 / 09:20 AM IST
EVMలు బాగా పని చేస్తున్నాయ్.. తప్పుడు వార్తలు నమ్మొద్దు : ఈసీ ద్వివేదీ

Updated On : April 11, 2019 / 9:20 AM IST

సాయంత‌్రం 6 లోపు పోలింగ్ బూత్ లో ఉండి, ఓటర్ల లిస్టు లో పేరు ఉన్నవాళ్లందరికీ  ఓటు హక్కు కల్పిస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ  ద్వివేది చెప్పారు.

అమరావతి : సాయంత‌్రం 6 లోపు పోలింగ్ బూత్ లో ఉండి, ఓటర్ల లిస్టు లో పేరు ఉన్నవాళ్లందరికీ  ఓటు హక్కు కల్పిస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ  ద్వివేది చెప్పారు. పోలింగ్ ప్రారంభంలో ఈవీఎంలు మొరాయించిన   బూత్ లలోనూ, ఆలస్యంగా ప్రారంభమైనా..సాయంత్రం 6 లోపు బూత్ లలో ఉన్నావారికి రాత్రి  ఎంత టైమ్ అయినా వారు ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు.
Read Also : బీభత్సం : పూతలపట్టు వైసీపీ అభ్యర్థి బాబుపై దాడి

రాజకీయ పార్టీల ఏజెంట్లు ఆధ్వర్యంలో ఈవీఎంల మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాతే పోలింగ్ స్టార్ట్ చేశామని, కాబట్టి ఈవీఎంలు పని చేయలేదని పుకార్లు పుట్టించవద్దని  కోరారు.రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని, మధ్యాహ్నం ఒంటి గంటకు 41 శాతం పోలింగ్ జరిగిందని సాయంత్రానికి  80 శాతం జరుగుతుందని అనుకుంటున్నామని ఆయన అన్నారు. 

కొంత మంది కావాలనే EVMల పనితీరులపై అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారని.. కొందరు కావాలనే టార్గెట్ గా వ్యవహరిస్తున్నారంటూ ఉదయం నుంచి వస్తున్న కథనాలపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని పోలింగ్ బూత్ సెంటర్లలోనూ అన్నీ బాగా పని చేస్తున్నాయన్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. కొందరు పనిగట్టుకుని అబద్దాలను ప్రచారం చేస్తున్నారని.. ప్రజలు వాటిని నమ్మొద్దని కోరారు. 
Read Also : EVMలు బాగా పని చేస్తున్నాయ్.. తప్పుడు వార్తలు నమ్మొద్దు : ఈసీ ద్వివేదీ