Mangalagiri NRI College : మంగళగిరి ఎన్‪ఆర్ఐ కాలేజ్ సభ్యుల ఆస్తులు అటాచ్

Mangalagiri NRI College : మనీ లాండరింగ్ కేసులో ఏపీ, తెలంగాణలోని భూములు, భవనాలను ఈడీ అటాచ్ చేసింది.

Mangalagiri NRI College : మంగళగిరి ఎన్‪ఆర్ఐ కాలేజ్ సభ్యుల ఆస్తులు అటాచ్

Mangalagiri NRI College

Updated On : May 11, 2023 / 10:38 PM IST

Mangalagiri NRI College : మంగళగిరి ఎన్‪ఆర్ఐ కాలేజ్ సభ్యుల ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ. నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, మణి అక్కినేనికి చెందిన రూ.307 కోట్ల ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. రూ.15కోట్ల బ్యాంకు లావాదేవీలతో పాటు, భూములు, భవనాలు.. అటాచ్ చేసిన లిస్టులో ఉన్నాయి. మనీ లాండరింగ్ కేసులో ఏపీ, తెలంగాణలోని భూములు, భవనాలను ఈడీ అటాచ్ చేసింది.

మంగళగిరిలో ఉన్న ఎన్ఆర్ఐ కాలేజీ, మెడికల్ కాలేజీ వివాదం నడుస్తోంది. గతంలోనే ఈడీ, ఐటీ అధికారులు దాడులు చేశారు. సంస్థకు సంబంధించిన నిధులను పక్కదారి పట్టించారని నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈడీ ఆస్తులు అటాచ్ చేసింది. ఎన్. ఉపేంద్రనాథ్, అక్కినేని మణిలపై మనీ లాండరింగ్ కేసు గతంలోనే నమోదైంది.

Also Read..Pawan Kalyan : సీఎం పదవి, పొత్తులపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ఇప్పుడు రూ.307 కోట్ల విలువైన చర స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. వాటితో పాటు రూ.17.61 కోట్ల విలువైన బ్యాంకు ఖాతాలు, అదే విధంగా ఏపీ, తెలంగాణలో ఉన్న స్థిరాస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. ఎన్ఆర్ఐ కాలేజ్, మెడికల్ సైన్సెస్ గతం నుంచి కూడా వివాదంలో ఉంది. దీనికి సంబంధించి కోట్లాది రూపాయల నిధులను పక్కదారి పట్టించారని వివిధ సందర్భాల్లో కేసులు నమోదయ్యాయి.