రేపు అకౌంట్లలో డబ్బులు :పుసుపు-కుంకుమ నిధులపై వీడిన సస్పెన్

  • Published By: venkaiahnaidu ,Published On : April 3, 2019 / 03:58 PM IST
రేపు అకౌంట్లలో డబ్బులు :పుసుపు-కుంకుమ నిధులపై వీడిన సస్పెన్

Updated On : April 3, 2019 / 3:58 PM IST

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పసుపు- కుంకుమ పథకం మూడో విడత నిధులపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మూడో విడతకు సంబంధించిన నిధులను ముందుగానే కేటాయించడంతో ఎన్నికల నిబంధనలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జీకే ద్వివేది స్పష్టంచేశారు. నిబంధనల ప్రకారం ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీలు పాల్గొనకూడదని తెలిపారు.మూడో విడతలో కేటాయించిన నిధుల్లో కొత్త లబ్ధిదారులను చేర్చకూడదని సూచించారు.దీంతో ఏప్రిల్-4,2019న మూడో విడత కింద డ్వాక్రా సంఘాల్లోని ఒక్కో మహిళ అకౌంట్లో రూ.4వేలు పడనున్నాయి.