ఏనుగుల దాడిలో రైతు మృతి

elephant Farmer killed : విజయనగరం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గజరాజుల దాడిలో రైతు లక్ష్మీనాయుడు మృతి చెందాడు. తెల్లవారుజామున లక్ష్మీనాయుడు పొలానికి వెళ్లగా అక్కడ అతనిపై ఏనుగులు దాడి చేశాయి. పొలంలోనే రైతును చంపేశాయి. కొద్ది రోజులుగా ఏనుగుల సంచారంతో కొమరాడ మండలం పరశురాంపురం ప్రజలు వణికిపోతున్నారు. ఈ ఘటనలో పొలాలకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.
7.30 గంటల ప్రాంతంలో లక్ష్మీనారాయణ పొలానికి వెళ్లాడు. ఒక ఏనుగు ఆయనపై దాడి చేసింది. కిందపడేసి తొక్కి చంపేసింది. లక్ష్మీనారాయణకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. దీంతో పరుశరాంపురం గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.
మూడేళ్లుగా ఏనుగులు గ్రామంలో తిష్ట వేశాయి. ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. గడిచిన మూడేళ్లలో ఏనుగల దాడిలో సుమారు ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. వేలాది ఎకరాల్లో పంటను నాశనం చేస్తున్నాయి.
గత కొన్ని సంవత్సరాలుగా ఏనుగల దాడితో మృత్యువాత పడుతున్నారు. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. అధికారులు ఏనుగులను వేరే ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేయడం లేదు.