Eluru: మృత్యంజయుడు.. ఫుల్లుగా తాగి వాగు దాటబోయి నీటిలో..

వాగులో పడిన వారెవ్వరూ ప్రాణాలతో బయటపడలేదట. పైగా పొద్దుపొద్దున్నే ఫుల్లుగా తాగి నీటిలో కొట్టుకుపోయాడు. ఇంకేముంది చూసేవాళ్లెవరూ ప్రాణాలతో బయటపడతారనుకోరు. కానీ, గూటాలకు చెందిన నాగేశ్వరరావు మత్తులో ఉండే పోరాడాడు. స్థానికుల చొరవతో ఊపిరి పీల్చుకున్నాడు.

Eluru: మృత్యంజయుడు.. ఫుల్లుగా తాగి వాగు దాటబోయి నీటిలో..

Eluru Koyyalagudem (1)

Updated On : July 27, 2022 / 6:45 PM IST

Eluru: వాగులో పడిన వారెవ్వరూ ప్రాణాలతో బయటపడలేదట. పైగా పొద్దుపొద్దున్నే ఫుల్లుగా తాగి నీటిలో కొట్టుకుపోయాడు. ఇంకేముంది చూసేవాళ్లెవరూ ప్రాణాలతో బయటపడతారనుకోరు. కానీ, గూటాలకు చెందిన నాగేశ్వరరావు మత్తులో ఉండే పోరాడాడు. స్థానికుల చొరవతో ఊపిరి పీల్చుకున్నాడు.

ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామంలో ఉదయం 11 గంటలకు ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఉన్న నాగేశ్వరరావు తూర్పు కాలువ వాగు దాటే ప్రయత్నం చేశాడు. అలా వాగులో పడిపోయి దాదాపు కిలోమీటర్ దూరం వరకూ కొట్టుకుపోయాడు. మధ్యలో కనిపించిన చెట్టు ఆసరాగా కనిపించింది. దానిని పట్టుకుని ప్రవాహం నుంచి కాపాడుకున్నాడు.

యాదృచ్ఛికంగా చూసిన స్థానికులు నాగేశ్వరరావు కొట్టుకుపోయి అలా పట్టుకుని ఉండటం గమనించారు. వెంటనే స్పందించి అతన్ని రక్షించారు. గతంలో వాగులో గల్లంతైన వారు బతికి బట్టకట్టలేదని, నాగేశ్వరరావు మృత్యంజయుడని చెబుతున్నారు.

Read Also : పాలేరు, చీటూరు వాగుల్లో చిక్కుకున్న 37 మంది కూలీలు, గొర్రెలకాపర్లు సేఫ్