Labours Safe : పాలేరు, చీటూరు వాగుల్లో చిక్కుకున్న 37 మంది కూలీలు, గొర్రెలకాపర్లు సేఫ్

సూర్యాపేట జిల్లా జి.కొత్తపల్లి వద్ద పాలేరువాగులో చిక్కుకున్న వ్యవసాయ కూలీలను రెస్క్యూ టీమ్స్‌ సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో.. వాగులో చిక్కుకుపోయిన 23 మంది కూలీలను ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్‌ కాపాడాయి. మరోవైపు జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని చీటూరు వాగు, పెద్దవాగు మధ్యలో చిక్కుకున్న 14 మంది కూలీలు సురక్షితంగా బయటపడ్డారు.

Labours Safe : పాలేరు, చీటూరు వాగుల్లో చిక్కుకున్న 37 మంది కూలీలు, గొర్రెలకాపర్లు సేఫ్

Safe

Labours Safe : సూర్యాపేట జిల్లా జి.కొత్తపల్లి వద్ద పాలేరువాగులో చిక్కుకున్న వ్యవసాయ కూలీలను రెస్క్యూ టీమ్స్‌ సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో.. వాగులో చిక్కుకుపోయిన 23 మంది కూలీలను ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్‌ కాపాడాయి. 12 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన అధికారులు.. దశలవారీగా కూలీలను ఒడ్డుకు చేర్చారు. భారీ వర్షంతో.. ఒక్కసారిగా పాలేరువాగు పొంగింది. ఉద్ధృతంగా ప్రవహించడంతో.. వాగు మధ్యలోని వ్యవసాయం క్షేత్రంలో 23 మంది కూలీలు చిక్కుకుపోయారు.

వారిని రక్షించేందుకు నిన్న రాత్రి ప్రయత్నాలు చేసినప్పటికీ.. భారీ వర్షం, చీకటిపడటంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో రాత్రంతా ఆ కూలీలు వాగు మధ్యలోనే జాగారం చేయాల్సి వచ్చింది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయంభయంగా గడిపారు. వీరంతా మహబూబాబాద్‌ జిల్లా దంతాపల్లి మండలం చౌళ్లతండావాసులుగా గుర్తించారు. సహాయక చర్యలను రెవెన్యూ అధికారులు, పోలీసులు పర్యవేక్షించారు. భద్రాచలం నుంచి హుటాహుటిన ఎన్డీఆర్ఎఫ్‌ టీమ్స్‌ను రప్పించారు. వాగుమధ్యలో చిక్కుకున్న కూలీలకు డ్రోన్‌ కెమెరాల సాయంతో అధికారులు ఆహారం పంపించారు.

Two Died Warangal : భారీ వర్షాలకు వరంగల్ లో కూలిన రెండు భవనాలు..ఇద్దరు దుర్మరణం

మరోవైపు జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని చీటూరు వాగు, పెద్దవాగు మధ్యలో చిక్కుకున్న కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. సుమారు 7 గంటల పాటు తీవ్రంగా శ్రమించిన ఎన్డీఆర్ఎఫ్‌ టీమ్స్‌.. 14 మంది కూలీలను ఒడ్డుకు తీసుకొచ్చారు. భారీ వర్షాలకు చీటూరులో వాగు మధ్యలో 14 మహిళా కూలీలు, గొర్రెల కాపరులు చిక్కుకుపోయారు. నిన్న ఉదయం పొలం పనులకు వెళ్లిన కూలీలు తిరిగి ఇంటికి వచ్చే సమయంలో వాగు ప్రవాహం పెరిగింది.

దీంతో వారంతా అక్కడే చిక్కుకుపోయారు. సాయం కోసం గంటల తరబడి ఎదురుచూశారు. అప్పటికే రాత్రి కావడంతో.. అధికారులు సహాయక చర్యలు చేపట్టినా అవి ఫలించలేదు. జిల్లా కలెక్టర్ శివలింగయ్య అధికారులను అప్రమత్తం చేయడంతో.. వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. రాత్రి సమయంలోనూ నిర్విరామంగా శ్రమించిన రెస్క్యూ టీమ్స్‌..కూలీలను బయటికి తీసుకొచ్చాయి.