Two Died Warangal : భారీ వర్షాలకు వరంగల్ లో కూలిన రెండు భవనాలు..ఇద్దరు దుర్మరణం
వరంగల్ లో విషాదం నెలకొంది. భారీ వర్షాలకు మండిబజార్‌లో రెండు పురాతన భవనాలు కూలిపోయాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా రెండు బిల్డింగులు కూలిపోవడంతో 60ఏళ్ల పైడిన వ్యక్తి, 20ఏళ్ల ఫిరోజ్ స్పాట్‌లోనే చనిపోయారు.

Warangal
Two Died Warangal : వరంగల్ లో విషాదం నెలకొంది. భారీ వర్షాలకు మండిబజార్‌లో రెండు పురాతన భవనాలు కూలిపోయాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా రెండు బిల్డింగులు కూలిపోవడంతో 60ఏళ్లు పైడిన వ్యక్తి, 20ఏళ్ల ఫిరోజ్ స్పాట్‌లోనే చనిపోయారు. ఇక గాయపడ్డ మహిళ సమ్మక్క పరిస్థితి విషమంగా ఉంది. అమెను ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తెలంగాణపై వరుణుడు మళ్లీ తన ప్రతాపం చూపుతున్నాడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు హైదరాబాద్‌సహా.. జిల్లాల్లో భారీ వానలు పడ్డాయి. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణశాఖ. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో.. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో.. రాష్ట్రంలో పలుచోట్ల కూలీలు వాగుల మధ్యలో చిక్కుకుపోయారు. సూర్యాపేట జిల్లా జి.కొత్తపల్లి వద్ద పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో… వాగు మధ్యలోని వ్యవసాయం క్షేత్రంలో 23 మంది కూలీలు చిక్కుకుపోయారు. వారిని నిన్న రక్షించేందుకు నిన్న రాత్రి ప్రయత్నాలు చేసినప్పటికీ చీకటిపడటంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదు.
దీంతో రాత్రంతా ఆ కూలీలు వాగు మధ్యలోనే జాగారం చేయాల్సి వచ్చింది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయంభయంగా గడిపారు. వీరంతా మహబూబాబాద్ జిల్లా దంతాపల్లి మండలం చౌళ్లతండావాసులుగా గుర్తించారు. వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తం కాగా… అవసరమైతే హెలికాప్టర్‌ను రంగంలోకి దించాలని యోచిస్తున్నారు.
Heavy Rains : తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు..నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్
జనగామ జిల్లాలోను ఇలాంటి సీన్ కనిపించింది. భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగుతుండటంతో… లింగాలఘనపురం మండలంలోని చీటూరులో వాగు మధ్యలో 14 మహిళా కూలీలు, గొర్రెల కాపరులు చిక్కుకుపోయారు. నిన్న ఉదయం పొలం పనులకు వెళ్లిన కూలీలు తిరిగి ఇంటికి వచ్చే సమయంలో వాగు ప్రవాహం పెరిగింది. దీంతో వారంతా అక్కడే చిక్కుకుపోయారు. సాయం కోసం గంటల తరబడి ఎదురుచూశారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టినా అవి ఫలించలేదు. దీంతో వారుతో రాత్రంతా అక్కడే ఉండిపోయారు. వాగుల మధ్యలో ఉన్న శ్మశాన వాటికలో తలదాచుకున్నారు.