Eluru Police : లక్ష ఇస్తే ఇంజినీరింగ్ సర్టిఫికెట్.. ఏలూరులో కలకలం, నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా అరెస్ట్, యూట్యూబ్ లో చూసి

యూట్యూబ్ లో నకిలీ ధ్రువపత్రాలు ఎలా తయారు చేయాలో నేర్చుకుని వాటికి సంబంధించిన మెటీరియల్ చెన్నై నుండి కొనుగోలు చేసి ఫేక్ సర్టిఫికెట్స్ తయారీ చేస్తోంది ఈ ముఠా. Eluru Fake Certificates

Eluru Police : లక్ష ఇస్తే ఇంజినీరింగ్ సర్టిఫికెట్.. ఏలూరులో కలకలం, నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా అరెస్ట్, యూట్యూబ్ లో చూసి

Eluru Fake Certificates (Photo : Google)

Updated On : November 5, 2023 / 11:45 PM IST

Eluru Fake Certificates : కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కాసుల కక్కుర్తితో అడ్డదారులు తొక్కుతున్నారు. చదువుకోకపోయినా పర్లేదు.. డబ్బు ఇస్తే చాలు చేతిలో సర్టిఫికెట్లు చేతిలో పెడుతున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్.. ఇలా ఏదైనా.. చదువుకోకపోయినా సర్టిఫికెట్ మీ చేతికి అందుతుంది. డబ్బు చెల్లిస్తే చాలు పనైపోతుంది. తాజాగా వారి పాపం పండింది. నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా గుట్టు రట్టైంది.

ఏలూరులో కలకలం రేగింది. నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ధ్రువపత్రాల తయారీని ఏలూరులోని ప్రైవేట్ కాలేజీ మేనేజ్ మెంట్ గుర్తించింది. దూరవిద్యకు సంబంధించి కళాశాలను యాజమాన్యం నడుపుతోంది. తమ కాలేజీకే సంబంధించిన నకిలి సర్టిఫికెట్లను మేనేజ్ మెంట్ గుర్తించింది. దాంతో కాలేజీ యాజమాన్యం నివ్వెరపోయింది. దీన్ని సీరియస్ గా తీసుకుంది.

Also Read : 6 నెలల్లో రూ.21 కోట్లు.. ఓ కూరగాయల వ్యాపారి ఎలా సంపాదించాడో తెలిస్తే షాకవుతారు

వెంటనే అలర్ట్ అయిన కాలేజీ యాజమాన్యం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు చింతలపూడి పోలీసులు. విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. చింతలపూడికి చెందిన కొలుకులూరి సోంబాబుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ముఠా సభ్యులపై నిఘా పెట్టారు. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముగ్గురు సభ్యుల మఠాను అరెస్ట్ చేశారు.

గతంలో టోల్ ప్లాజాలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేసిన అనుభవంతో నకిలీ సర్టిఫికెట్స్ తయారీకి సహకరించాడు దినేశ్. యూట్యూబ్ లో నకిలీ ధ్రువపత్రాలు ఎలా తయారు చేయాలో నేర్చుకుని వాటికి సంబంధించిన మెటీరియల్ చెన్నై నుండి కొనుగోలు చేసి ఫేక్ సర్టిఫికెట్స్ తయారీ చేస్తోంది ఈ ముఠా. 10వ తరగతి నుండి ఇంటర్ సెకండియర్ వరకు సర్టిఫికెట్ కావాలంటే 30 నుండి 50వేల వరకు వసూలు చేస్తోందీ ముఠా. ఇక డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ధ్రువపత్రాలకు 80వేల నుండి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తోంది. ఇంజనీరింగ్, ఎంటెక్ సర్టిఫికెట్ కావాలంటే లక్ష నుండి లక్షా 50వేలు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Also Read : పెళ్లి కాగానే పారిపోయిన పెళ్లికూతురు.. తిరగబడ్డ పెళ్లి కొడుక్కి కరెంట్ షాక్