Nallari Kiran Kumar Reddy : కాంగ్రెస్‌కి మాజీ ముఖ్యమంత్రి రాజీనామా, త్వరలో బీజేపీలోకి..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. కొంతకాలం ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేసేశారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరనున్నారని సమాచారం. బీజేపీలో కిరణ్ కుమార్ రెడ్డికి ఎలాంటి పదవి ఇస్తారు, ఏ బాధ్యతలు అప్పగిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది.

Nallari Kiran Kumar Reddy : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. కొంతకాలం ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేసేశారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరనున్నారని సమాచారం. బీజేపీలో కిరణ్ కుమార్ రెడ్డికి ఎలాంటి పదవి ఇస్తారు, ఏ బాధ్యతలు అప్పగిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది.
కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, తన రాజీనామాను ఆమోదించాలంటూ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడికి లేఖ రాశారు. కిరణ్ కుమార్ బీజేపీలో చేరతారంటూ ఇటీవల కథనాలు వచ్చాయి. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేయడంతో ఆ కథనాలకు మరింత బలం చేకూరింది.(Nallari Kiran Kumar Reddy)
ఇటీవల ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతూ.. కిరణ్ కుమార్ ఎంతో చురుకైన నాయకుడు అని, పార్టీలోకి వస్తే సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని అన్నారు. కిరణ్ వంటి నేత వస్తే, ఏపీలో బీజేపీ బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రి. రాష్ట్ర విభజన సమయంలో జై సమైక్యాంధ్ర పార్టీ ఏర్పాటు చేశారు. 2014 ఎన్నికల తర్వాత ఆయన రాజకీయంగా తెరమరుగయ్యారు.
రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కు దూరమైన కిరణ్ కుమార్ రెడ్డి.. 2014 ఎన్నికల సమయంలో జై సమైక్యాంధ్ర పేరుతో పార్టీ పెట్టారు. ఆ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఆ తర్వాత మళ్లీ హస్తం గూటికి చేరుకున్న కిరణ్ కు.. పార్టీ పగ్గాలు అప్పజెబుతారన్న ప్రచారం జరిగింది. కాంగ్రెస్ లోనే ఉన్నప్పటికీ.. ఆయన కొంత కాలంగా సైలెంట్ గా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా యాక్టివ్ గా కనిపించలేదు.
* కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా.
* ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు శనివారం సాయంత్రమే రాజీనామా లేఖ పంపిన కిరణ్.
* కిరణ్ కుమార్ రెడ్డి 1989 సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి గెలుపొందారు.
* తర్వాత 1994లో ఓడిపోయినా.. 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచారు.
* 2004లో ప్రభుత్వ చీఫ్ విప్, 2009లో అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికయ్యారు.
* అనంతరం 2014 ఎన్నికల వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
* కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి.. త్వరలోనే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారని సమాచారం.