తొలిజాబితాలో తన పేరు లేదని కుప్పకూలిన టీడీపీ సీనియర్ నేత.. ఆసుపత్రికి తరలింపు

Buragadda: పెడనలో తనకే అవకాశం వస్తుందని ఆశిస్తూ ఎన్నికల ప్రచారంలో బూరగడ్డ వేదవ్యాస్ పాల్గొన్నారు. సీటు దక్కకపోవడంతో..

తొలిజాబితాలో తన పేరు లేదని కుప్పకూలిన టీడీపీ సీనియర్ నేత.. ఆసుపత్రికి తరలింపు

Buragadda

Buragadda Vedavyas: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన తొలిజాబితాలో పెడన నియోజకవర్గం నుంచి తన పేరు లేకపోవడంతో మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ కుప్పకూలారు. ఆయన కృత్తివెన్ను మండలం చిన్నపంద్రాకాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

అదే సమయంలో టీడీపీ ఫస్ట్ లిస్టులో పెడన నియోజకవర్గం నుంచి పోటీకి కాగిత కృష్ణ ప్రసాద్ పేరును చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పెడనలో తనకే అవకాశం వస్తుందని ఆశిస్తూ ఎన్నికల ప్రచారంలో బూరగడ్డ వేదవ్యాస్ పాల్గొన్నారు. సీటు దక్కకపోవడంతో ఎన్నికల ప్రచారంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయన హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు, టికెట్లు దక్కని నేతలు తమ పార్టీపై మండిపడుతున్నారు. పి.గన్నవరం వద్ద టీడీపీలో అసమ్మతి గాలులు మొదలయ్యాయి. టీడీపీ అభ్యర్థిగా మహాసేన రాజేశ్‌ను ఖరారు చేయడంపై పలువురు తెలుగు దేశం నేతలు మండిపడ్డారు. టీడీపీ సీనియర్ నేత డొక్కా నాథ్ బాబు ఇంటి వద్ద టీడీపీ నేతలు సమావేశమయ్యారు. పి.గన్నవరం మండల అధ్యక్షుడు తోలేటి సత్తిబాబు పదవికి రాజీనామా చేశారు. పి.గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని మూసివేశారు.

Read Also: జనసేనకు దక్కిన సీట్లపై మంత్రి రోజా సెటైర్లు