మేము చేసిన పనులకు మీరు బ్రాండింగ్ చేసుకోవడం కరెక్ట్ కాదు- గుడివాడ అమర్నాథ్

అధికారంలోకి వచ్చి మూడో నెల నడుస్తుంది. ఇప్పటికీ వైసీపీ ఏమీ చెయ్యలేదంటు విమర్శలు చేస్తున్నారు. మీరు ఏం చేస్తారు, ఎలాంటి అభివృద్ది చేస్తారో చెప్పడం లేదు.

మేము చేసిన పనులకు మీరు బ్రాండింగ్ చేసుకోవడం కరెక్ట్ కాదు- గుడివాడ అమర్నాథ్

Gudivada Amarnath : అనకాపల్లి జిల్లాలో నలుగురు పిల్లలు మృతి చెందడం దిగ్భ్రాంతి కలిగించిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఇంతటి నిర్లక్ష్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అనవసర విషయాలపై దృష్టి పెట్టేకంటే ఇలాంటి విషయాలపై దృష్టి పెట్టాలని జగన్ తెలిపారన్నారు.

”ఈరోజు శ్రీసిటీలో పరిశ్రమల ప్రారంభం, శంకుస్థాపన చేశారు. ఓ పరిశ్రమ రావలంటే ఎంత సమయం పడుతుంది. అనుమతులు రావడానికి ఎంత సమయం పడుతుంది. ఓ పరిశ్రమ రావడం, అనుమతులు రావాలంటే కనీసం 6 నెలలు సమయం పడుతుంది. కానీ ప్రభుత్వం వచ్చి రెండు నెలల్లో పరిశ్రమలు ఎలా వచ్చాయి? మా ప్రభుత్వం తెచ్చిన పరిశ్రమలు మీరు ప్రారంభించారని గుర్తించాలి. మార్కెటింగ్ లో సీఎం చంద్రబాబును మించిన వారు లేరు. శ్రీసిటీతో పాటు అనేక ప్రాంతాల్లో పరిశ్రమలకు పెద్దపీట వేశాము. మీరు ప్రభుత్వ హయంలో పరిశ్రమలకు ఇస్తామన్న పోత్సాహకాలు ఇవ్వకుండా వెళ్లిపోయారు. మా ప్రభుత్వ హయాంలో మీరు ఇవ్వాల్సిన ఇన్సెన్టివ్స్ మేము అందచేశాము.

అధికారంలోకి వచ్చి మూడో నెల నడుస్తుంది. ఇప్పటికీ వైసీపీ ఏమీ చెయ్యలేదంటు విమర్శలు చేస్తున్నారు. మీరు ఏం చేస్తారు, ఎలాంటి అభివృద్ది చేస్తారో చెప్పడం లేదు. మేము చేసిన పనులకు మీరు బ్రాండింగ్ చేసుకోవడం మంచిది కాదు. అమర రాజా ప్రధాన యూనిట్ ఏపీలో ఉంది. వాళ్లు పెట్టుబడులు పెట్టేందుకు పక్క రాష్ట్రానికి పోలేదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పరిశ్రమలు రావాలని కోరుకుంటాము. రాష్ట్రాభివృద్ధి కోసం అనేక పోర్టులు నిర్మాణం చేశాం. షర్మిల రావాలని మేము కోరుకుంటున్నాము. మరి ఆమె తన అన్నయ్యకు రాఖీ కడుతుందో లేదో చూడాలి” అని గుడివాడ అమర్నాథ్ అన్నారు.

Also Read : అందుకే ఎక్కడ చూసినా రికార్డులు తగలబెడుతున్నారు: మంత్రి అచ్చెన్నాయుడు