Perni Nani: జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారనే భయం వారందరిలో కనిపించింది- పేర్నినాని
అమరావతి పేరుతో రెండేళ్లలో 43 వేల కోట్లు అప్పులు మంజూరు చేసుకున్నారు. 13 వేల కోట్లు డ్రా చేసి తినేశారు.
Perni Nani: కూటమి సర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి పేర్నినాని. నేటి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెద్ద డ్రామా అని అన్నారు. జగన్ ను తిట్టడానికే ఈ సమావేశం పెట్టినట్టు ఉందని మండిపడ్డారు. చట్టం అవ్వాలంటే అసెంబ్లీ పెట్టేస్తే చాలా..? డ్రామా కనుకే మండలి పెట్టలేదు అని విమర్శించారు. అమరావతికి ఏదో పొడిచేస్తున్నాం అని బిల్డప్ ఇవ్వడానికే ఈ డ్రామా అని ధ్వజమెత్తారు. ఈ తీర్మానం ఆల్రెడీ భూములు ఇచ్చిన రైతుల కోసం కాదు, కొత్తగా తీసుకోబోయే భూముల కోసం రైతులకు ఎర వెయ్యడానికే ఈ తీర్మానం అని ఆరోపించారు.
”చంద్రబాబు బస్సులో నిద్రపోయింది అమరావతి కోసం కాదు ఓటుకి నోటు కేసు కోసం. ఈరోజు మాట్లాడిన వారందరిలో జగన్ అధికారంలోకి వస్తారనే భయం కనిపించింది. ఎవరొచ్చినా మార్చేది లేదని చెప్తున్నారంటే జగన్ వస్తారని మీరే ఒప్పుకున్నట్టేగా. అమరావతికి పెద్ద పాపం చేసింది చంద్రబాబే. జగన్ కి మసి పూసి నింద వేశారు. ఇన్నేళ్ళు అధికారంలో ఉండి చట్టబద్ధత ఎందుకు చెయ్యలేదు..? అమరావతి పేరుతో చేస్తున్న భారీ అవినీతిని మేము వ్యతిరేకిస్తున్నాం. అమరావతి పేరుతో ఇష్టమొచ్చినట్లు అప్పులు చేసి దోచేస్తున్నారు. అమరావతి పేరుతో రెండేళ్లలో 43 వేల కోట్లు అప్పులు మంజూరు చేసుకున్నారు. 13 వేల కోట్లు డ్రా చేసి తినేశారు.
అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ అనేది పెద్ద మాయ. ప్రత్యేక సమావేశాల్లో రైతులకు ఏం న్యాయం చేయబోతున్నారో ఎందుకు చెప్పలేదు..? అప్పులెన్ని చేశారు..? భూములమ్మిన డబ్బులు ఏం చేశారో చెప్పే ధైర్యం ఎందుకు చెయ్యలేదు..? కేంద్రం నుండి అమరావతి కోసం ఏం నిధులు తెచ్చారో ఎందుకు చెప్పలేదు..? నవ నగరాలు ఎప్పటికి పూర్తి చేస్తారు..? అమరావతికి బుల్లెట్ ట్రైన్, విమానం ఎప్పుడు తెస్తారు..? రైతుల ఫ్లాట్ ను గజం లక్ష ఎప్పటికి చేస్తారు..? భూములిచ్చిన 29 వేల రైతులకు ఫ్లాట్లు ఎప్పుడు ఇస్తారో చూపించే సినిమా మీకు ఉందా..?” అని ప్రశ్నల వర్షం కురిపించారు పేర్నినాని.
Also Read: జగన్‌వి ఊసరవెల్లి రాజకీయాలు.. అమరావతిపై విషం చిమ్మారు- సీఎం చంద్రబాబు
