టీడీపీ గూటికి మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్..?

గతంలో జనసేన ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలో చేరారు రాపాక వరప్రసాద్.

టీడీపీ గూటికి మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్..?

Ex Mla Rapaka Varaprasad (Photo Credit : Google)

Updated On : October 13, 2024 / 9:28 PM IST

Rapaka Varaprasad : వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ఇక వైసీపీలో ఉండను అని క్లియర్ కట్ గా చెప్పేశారాయన. తాను పార్టీ మారుతున్నాననే ప్రచారం జరుగుతుందన్న దానిపై స్పందించిన రాపాక.. ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశం తర్వాత నిర్ణయం తీసుకుంటానన్నారు.

కాగా, రాపాక టీడీపీలో చేరే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో జనసేన ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలో చేరారు రాపాక వరప్రసాద్. గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారాయన. వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

వైసీపీలో కష్టపడి పని చేశాను..
”నేను పార్టీ మారబోతున్నా అని ప్రచారం జరుగుతోంది. వైసీపీలో నేనిక ఉండదల్చుకోలేదు. వైసీపీకి నేను క్లియర్ గా చెప్పేశాను. నన్ను మీరు నమ్మలేదు. మీరు చెప్పిన అన్ని పనులు నేను చేశాను. చాలా కష్టపడ్డాను. గడపగడపకు కార్యక్రమం ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు. కానీ, నేను చేశాను. 100 శాతం ఆ పని చేశాను.

ఆయనకు టికెట్ ఇచ్చి నన్ను అవమానించారు..
ఇంత కష్టపడి పని చేస్తే.. నన్ను పక్కన పెట్టి టీడీపీలో ఉన్న నాయకుడిని తీసుకొచ్చారు. ప్రతి నిమిషం మిమ్మల్ని తిట్టి, నాతో వ్యక్తిగతంగా దెబ్బలాడినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నన్ను చాలా అవమానించారు. ఆ విషయంలో నేను చాలా ఇబ్బంది పడ్డాను. చాలా అవమానంగా ఫీల్ అయ్యాను.

ఇక, వైసీపీలో ఉండదలుచుకోలేదు..
అయినప్పటికీ మీరు ఎంపీ టికెట్ ఇస్తే నేను పోటీ చేయడానికి సిద్ధంగా లేను. కానీ, ఇక్కడున్న పెద్దలు తప్పదు మీరు ఒకసారి పోటీ చేయండి అంటే.. ఓడిపోతాను అని తెలిసినా చేశాను. ఇదంతా అయిన తర్వాత ఇంచార్జ్ పదవిని కూడా గొల్లపల్లి సూర్యారావుకి ఇచ్చి నడిపిస్తున్నారు. కాబట్టి నేను మీ పార్టీలో ఉండదలుచుకోలేదని వాళ్లకు కూడా చెప్పాను. మీటింగ్ లకు రాను, మీ పార్టీలో ఉండను అని చెప్పా.

వారితో చర్చించాకే ఏ పార్టీలోకి వెళ్లాలి అనే దానిపై నిర్ణయం..
నేను వేరే పార్టీలోకి వెళ్తానా లేదా అన్నది తర్వాతి విషయం. నేను టీడీపీ, బీజేపీ, జనసేనలోకి వెళ్తానని రూమర్స్ వస్తున్నాయి. ఏది ఏమైనా నేను వైసీపీకి అయితే రాజీనామా చేస్తున్నా. ఏదైనా పార్టీలోకి వెళ్లాలి అనుకుంటే.. కార్యకర్తలు, నా అభిమానులు, నా శ్రేయోభిలాషుల సలహా తీసుకుంటాను. వెళ్లాల్సి వస్తే ఏ పార్టీలోకి వెళ్లాలి అనే దానిపై చర్చిస్తాను” అని రాపాక వరప్రసాద్ చెప్పారు.

Also Read : ఏపీ ప్రభుత్వం, ప్రజలు అప్పుల్లో కూరుకుపోవడానికి కారణమెవరు?