ఏపీ ప్రభుత్వం, ప్రజలు అప్పుల్లో కూరుకుపోవడానికి కారణమెవరు?

రాష్ట్రంతో పాటు రాష్ట్ర ప్రజలు ఎందుకు అప్పుల పాలయ్యారో చెప్పాల్సిన బాధ్యత కూడా వైసీపీ మీదే ఉందనేది టీడీపీ వాదన.

ఏపీ ప్రభుత్వం, ప్రజలు అప్పుల్లో కూరుకుపోవడానికి కారణమెవరు?

Gossip Garage AP Debts (Photo Credit : Google)

Updated On : October 12, 2024 / 10:43 PM IST

Gossip Garage : అప్పు చేసి పప్పు కూడు. ఇది చాలా ఫేమస్‌ సామెత. అప్పైనా సరే పప్పుతో అన్నం తినాలనేది పాత మాట. బాకీ చేసి మరీ లగ్జరీ లైఫ్‌ లీడ్‌ చేయడం ఇప్పటి ట్రెండ్‌. అది పబ్లిక్‌ అయినా..పవర్‌లో ఉన్న ప్రభుత్వం అయినా. అప్పు చేయడం మొదలుపెడితే తమ కంటే బాగా ఎవరూ అప్పుచేయలేరంటున్నారు. అయితే ఏపీకి సంబంధించిన ఓ న్యూస్‌ ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తుంది. ఏపీ ప్రభుత్వం అప్పుల పాలైందనేది తెలిసిందే. అయితే ఏపీ ప్రజలు కూడా అప్పుల్లో నెంబర్‌ వన్‌గా ఉన్నారట. రాష్ట్రము, రాష్ట్ర ప్రజలు అప్పుల్లో ఉండటానికి కారణమేంటి.?

అప్పులు చేసే విషయంలో ఆంధ్రుడ్ని కొట్టేవారే లేరంట..!
అప్పు అంటే కొందరికి కరెంట్‌ షాక్‌ కొట్టినంత భయం. మరికొందరు మాత్రం అప్పే కదా అని లైట్ తీసుకుంటారు. అలా అప్పు చేసేందుకు ఏపీ ప్రజలు వెనకాడటం లేదట. అప్పులు చేసే విషయంలో ఆంధ్రుడ్ని కొట్టేవారే లేరంట. కేంద్రప్రభుత్వం రిలీజ్ చేసిన ఓ సర్వే వివరాలు షాక్‌కు గురి చేస్తున్నాయి. అప్పులు చేయడం మొదలుపెడితే ఆంధ్రుడి కంటే ఎవరూ బాగా చేయలేరని ప్రూవ్‌ చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అప్పుల బారిలో పడి ఉన్నారని లెక్కలు తెరపైకి వచ్చాయి. రాష్ట్రంలో 18ఏళ్లు దాటిన ప్రతీ లక్షమందిలో సగటున 60వేల మందిపై అప్పుల భారం ఉన్నట్లు.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రిపోర్ట్ చెబుతోంది.

భారీ అప్పులు చేసిన జగన్..!
ఏపీ సర్కార్‌ కూడా అప్పుల్లో ఉంది. ఇది కొత్త విషయమేమి కాదు. గత ఎన్నికలప్పుడు ఆంధ్రప్రదేశ్‌ అప్పులే హాట్‌ టాపిక్‌గా ప్రచారం జరిగింది. వైసీపీ హయాంలో 13లక్షల కోట్ల అప్పులు చేసి..రాష్ట్రాన్ని జగన్‌ నాశనం చేశారని టీడీపీ ఇప్పటికీ ఆరోపిస్తోంది. దేశంలో ఏ రాష్ట్రానికి అయినా ఎంతో కొంత అప్పు ఉంటుంది. కానీ జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు ఏపీ సర్కార్‌ చేసిన బాకీలు అయితే తలకు మించిన భారం అంటున్నారు. అడ్డూ అదుపు లేకుండా..రేపన్న ఆలోచనే లేకుండా అప్పుల మీద ఆధారపడే జగన్‌ పాలన నడించారని టీడీపీ చెబుతోంది. సంపద సృష్టించడం మీద ఫోకస్‌ చేయడం కంటే..ఏ శ్రమ లేకుండా అప్పు తెచ్చి అడ్డగోలుగా వ్యవహరించాని ఎక్స్‌పోజ్‌ చేస్తోంది.

కూటమి సర్కార్‌ అధికారంలోకి రాకపోతే.. రాష్ట్రం గతి ఏమయ్యేదో?
ప్రజలకు అయినా..ప్రభుత్వాలకు అయినా అప్పు ఎప్పుడూ భారమే. ఉన్నదాంట్లో బతకడం వదిలేసి గొప్పలకు పోయి అప్పులు చేస్తే అభాసు పాలు కావాల్సిందే. భవిష్యత్‌ నిర్మాణం కోసం..భయంతో చేసిన అప్పు ఎప్పుడూ సేఫే. కానీ బాధ్యత లేని బాకీ.. విలాసాలకు అలవాటు పడి చేసే అప్పు తలనొప్పే. గత ప్రభుత్వం అప్పులతో చేసిన తప్పులకు ఇప్పటి ఏపీ ప్రభుత్వం పరిస్థితి కష్టంగా ఉందంటున్నారు టీడీపీ నేతలు. ఇష్టారీతిన జగన్‌ చేసిన అప్పు..ఇప్పుడు భారంగా మారిందని..మండిపడుతున్నారు. ఏపీని గట్టెక్కించేందుకు సీఎం చంద్రబాబు కేంద్రం సహకారం కోసం చేతులు చాపే పరిస్థితి తెచ్చి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కార్‌ అధికారంలోకి రాకపోతే.. కేంద్రంలో తమ సహకారం బీజేపీకి అవసరం లేకపోతే..రాష్ట్రం గతి ఏం అయ్యేదో కూడా అర్థం కావడం లేదంటున్నారు. పోలవరం, అమరావతి నిర్మాణంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల కోసం..సీఎం చంద్రబాబు కిందా మీదా పడి కేంద్రం నుంచి నిధులు తెస్తున్నారని చెప్తున్నారు.

రాష్ట్ర ప్రజలు ఎందుకు అప్పుల పాలయ్యారో వైసీపీ చెప్పాలని డిమాండ్..
వైసీపీ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామంటోంది. ప్రజలకు ఇంటికెళ్లి డబ్బులు ఇచ్చామని అంటోంది. అలాంటప్పుడు రాష్ట్రంతో పాటు రాష్ట్ర ప్రజలు ఎందుకు అప్పుల పాలయ్యారో చెప్పాల్సిన బాధ్యత కూడా వైసీపీ మీదే ఉందనేది టీడీపీ వాదన. ప్రభుత్వం అప్పుల పాలైతే ప్రజలైనా బాగుపడాలి కదా.. అలా కాకుండా ప్రజలు కూడా అప్పుల పాలయ్యారంటే.. వైసీపీ హయాంలో అమలు చేసిన పథకాలు సక్సెస్‌ కాలేదని స్పష్టం అవుతోందని అంటోంది టీడీపీ.

 

Also Read : జగన్‌ గుడ్‌బుక్‌.. రెడ్‌బుక్‌కు కౌంటరేనా? క్యాడర్‌, లీడర్లలో భరోసా కల్పించే స్ట్రాటజీనా?