Lagadapati Rajagopal : రాజకీయాల్లోకి లగడపాటి రీ ఎంట్రీ..?! వైసీపీ ఎమ్మెల్యేతో చర్చలు..!
మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత లగడపాటి రాజగోపాల్ నందిగామలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మరికొందరు వైసీపీ నేతలతో భేటీ అయ్యారు. విజయవాడ్ ఎంపీగా లగడపాటి పోటీ చేస్తున్నారా?

Ex Mp Lagadapati Rajagopal Meet With Ysrcp Mla Vasantha Krishna Prasad
Lagadapati rajagopal meet with ysrcp mla vasantha krishna : లగడపాటి రాజగోపాల్ పరిచయం అక్కర్లేని వ్యక్తి. ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుపొందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. 2014 వరకు రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన లగడపాటి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తను చెప్పినట్లుగానే రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అటువంటి రాజగోపాల్ మరోసారి వార్తల్లో నిలిచారు. వైసీపీ ఎమ్మెల్యే వసంతక్రిష్ణ ప్రసాద్ తో లగడపాటి భేటీ కావటంతో ఏపీలో రాజకీయంగా చర్చ మాంచి హాట్ హాట్ గా మారింది. ఎన్నికలు వచ్చాయంటే చాలు లగడపాటి సర్వేలు నిర్వహిస్తూ బాగా పాపులర్ అయ్యారు. 2018 ఎన్నికల వరకు లగడపాటి నిర్వహించిన సర్వేలన్నీ దాదాపు నిజం కాగా, ఆ తర్వాత నుంచి రివర్స్ ఫలితాలు వచ్చాయి. ఇదిలా ఉంటే లగడపాటి రాజగోపాల్ వైసీపీ ఎమ్మెల్యేతో భేటీ కావటం మాత్రం ఆసక్తికరంగా మారింది.
Also read : Andhrapradesh : సీపీఎస్‌ను రద్దు చేయాలని CMO ముట్టడికి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పిలుపు..విజయవాడలో 144 సెక్షన్
మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత లగడపాటి రాజగోపాల్ నందిగామలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మరికొందరు వైసీపీ నేతలతో భేటీ అయ్యారు. వారితో కలిపి బ్రేక్ ఫాస్ట్ చేశారు. వీరి భేటీ మీద ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతంలో శని, ఆదివారాల్లో మాజీ ఎంపీ లగడపాటి పర్యటించారు. మైలవరం ఎమ్మెల్యే వసంతక్రిష్ణ ప్రసాద్ తో పాటు పలువురు వైసిపి కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యారు. శనివారం (ఏప్రిల్ 23,2022) రాత్రి చందర్లపాడులో నందిగామ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెలగపూడి వెంకటేశ్వరరావు కుమారుడి వివాహ రిసెప్షన్కు లగడపాటి, వసంత హాజరయ్యారు.
ఆ తరువాత నందిగామలోని స్థానిక మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పాలేటి సతీష్ ఇంట్లో లగడపాటి బస చేసి మరునాడు వసంత కృష్ణప్రసాద్ తో కలిసి అల్పాహారం తీసుకున్నారు. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్, వైసిపి నాయకులు మాజీ ఎంపీ మర్యాదపూర్వకంగా కలిశారు. తరువాత నందిగామలో ఇటీవల మృతి చెందిన వైసీపీ నాయకుడు మంగళూరు కోటి రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఐతవరంలో మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు ను కలిశారు.
Also read : MP Sakshi Maharaj : ‘జిహాదీలను ఎదుర్కోవటానికి హిందువులు విల్లు, బాణాలతో రెడీగా ఉండాలి’..
కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామానికి చెందిన గుదే వెంకటేశ్వరరావు ఇటీవల మృతి చెందారు. అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన పర్యటనకు, రాజకీయాలకు సంబంధం లేదని లగడపాటి విలేకరులకు తెలిపారు. మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నారా? అని ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని చెప్పారు. కానీ లగడపాటి తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు..పైగా వైసీపీ నేతలతో ఈయన భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.