Andhrapradesh : సీపీఎస్‌ను రద్దు చేయాలని CMO ముట్టడికి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పిలుపు..విజయవాడలో 144 సెక్షన్ | 144 section in vijayawada, with employees chelo tadepalli Call

Andhrapradesh : సీపీఎస్‌ను రద్దు చేయాలని CMO ముట్టడికి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పిలుపు..విజయవాడలో 144 సెక్షన్

ఏపీలో మరోసారి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టారు. చలో తాడేపల్లికి పిలుపునిచ్చాయి. దీంతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Andhrapradesh : సీపీఎస్‌ను రద్దు చేయాలని CMO ముట్టడికి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పిలుపు..విజయవాడలో 144 సెక్షన్

144 section in vijayawada..employees chelo tadepalli Call :  ఏపీలో మరోసారి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టారు. చలో తాడేపల్లికి పిలుపునిచ్చాయి. దీంతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ..ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చలో తాడేపల్లికి పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు విజయవాడలో 144 సెక్షన్‌ విధించారు. పోలీస్‌ యాక్ట్‌ 30 అమలు చేస్తున్నారు.

చలో సీఎంవోకు అనుమతి లేదని..ఎట్టిపరిస్థితుల్లో రాజధానికి రావద్దని సూచించారు. ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. అయినా ఉపాధ్యాయ సంఘాలు ఏమాత్రం లెక్క చేయకుండా వారి డిమాండ్స్ నెరవేర్చేవరకు ఈ ఆందోళన కొనసాగుతుందని తేల్చి చెబుతున్నారు.దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు విజయవాడ చేరుకోకుండా రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌ల దగ్గర అడ్డుకుంటున్నారు. యూటీఎఫ్‌ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ఉద్యోగుల చలో తాడేపల్లి పిలుపు నేపథ్యంలో సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. 650 మంది పోలీసులు బందోబస్తు విధుల్లో ఉండి అందరిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.

ఉపాధ్యాయులు విజయవాడకు వెళ్లొద్దంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. క్యాంపు కార్యాలయానికి వెళ్లే అన్ని మార్గాల్లో పోలీసులు మోహరించి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. అన్ని మార్గాల్లో సీసీకెమెరాలను ఏర్పాటు చేసి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. చెన్నై-కోల్‌కతా హైవే నుంచి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వైపు ఎవరూ రాకుండా ముళ్లకంచె ఏర్పాటు చేశారు. ప్రకాశం బ్యారేజీ, కనకదుర్గ వారధికి వెళ్లే ముందే తనిఖీలు చేస్తూ అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను ముందస్తుగానే అరెస్ట్‌ చేస్తున్నారు. మరోవైపు జిల్లాల నుంచి వస్తున్న యూటీఎఫ్‌ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధిస్తున్నారు.

 

 

 

×