కొత్త నిబంధనలు : కారు ఉన్నా ఆరోగ్య శ్రీ

వైఎస్సార్ ఆరోగ్య శ్రీ విస్తరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెల్లరేషన్ కార్డు, వైఎస్సార్ పెన్షన్, జగనన్న విద్యా వసతి దీవెన కార్డులున్నా వారికి ఆరోగ్య శ్రీ వర్తింపు ఉంటుందని వెల్లడించింది. ఈ మేరకు 2019, నవంబర్ 15వ తేదీ శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది. అన్ని రకాల బియ్యం కార్డు కలిగిన వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది.
వీరికి వర్తిస్తుంది…
> రూ. 5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారికి.
> 12 ఎకరాల మాగాణి, 35 ఎకరాల్లోపు మెట్ట ఉన్న వారికి
> రూ. 5 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న ఔట్ సోర్సింగ్, పార్ట్ టైమ్, కాంట్రాక్టు, పారిశుధ్య కార్మికులకు
> కుటుంబంలో ఒక కారు ఉన్నా వర్తిస్తుంది.
> కుటుంబంలో ఒక కారు కన్నా ఎక్కువగా ఉంటే పథకానికి అనర్హులు.
> 334 చదరపు అడుగులుకన్నా తక్కువ ప్రాంతానికి మున్సిపల్ ఆస్తి పన్ను చెల్లించే కుటుంబాలకు వర్తింపు.
ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టో, ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. అందులో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం ఒకటి. ఇటీవలే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లోనూ ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ వర్తిస్తుందని సీఎం జగన్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
Read More : పవన్ కళ్యాణ్ కు జ్ఞానం లేదు…చంద్రబాబుది దొంగ దీక్ష