Kota Vinutha : జనసేన బహిష్కృత నాయకురాలు కోట వినుత సెల్ఫీ వీడియో విడుదల.. పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావిస్తూ..
Kota Vinutha : శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్‌ఛార్జ్ కోటా వినూతన డ్రైవర్ శ్రీనివాసులు (రాయుడు) హత్య కేసులో సంచలన ట్విస్టు చోటు చేసుకుంది.

Kota Vinutha
Kota Vinutha : శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్‌ఛార్జ్ కోటా వినూతన డ్రైవర్ శ్రీనివాసులు (రాయుడు) హత్య కేసులో సంచలన ట్విస్టు చోటు చేసుకుంది. కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు ప్రైవేటుగా ఉన్న వీడియోలు, ఆమెకు సంబంధించిన అసభ్యకర దృశ్యాలు పంపితే తనకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రూ.30లక్షలు ఇస్తానని చెప్పారంటూ వినూతన డ్రైవర్ శ్రీనివాసులు గతంలో విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియో ఆదివారం వెలుగులోకి వచ్చింది. అయితే, తాజాగా.. వినూతన సైతం ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. ఈ క్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
జనసేన బహిష్కృత నాయకురాలు కోట వినుత సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. మనసునిండా పుట్టెడు బాధ ఉంది. చేయని తప్పుకు జైలుకు వెళ్లిన బాధ లేకపోయినా.. మేము చంపామని ప్రచారం చేయడం చాలా బాధ కలిగిస్తోందని అన్నారు. రాయుడు చావులో మా ప్రమేయం లేదని కోర్టు భావించింది కాబట్టే 19 రోజుల్లో బెయిలు ఇచ్చింది. నెల రోజుల్లోనే కేసులలో ఉన్న వారందరికీ బెయిల్ వచ్చిందని వినుత అన్నారు.
విదేశాల్లో రూ. లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికే. మనుషుల ప్రాణాలను తీసేందుకు కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ఎలాంటి సంబంధం లేదని ఈ కేసులో క్లీన్‌చిట్‌తో బయటకు వస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అయితే, చెన్నై కోర్టులో విచారణ జరుగుతున్నందున ఎక్కువ మాట్లాడలేను. నేను మాత్రం.. ఏ తప్పు చేయలేదు. నిజానిజాలు శివయ్యకు తెలుసు. ధైర్యంగా పోరాడుతామని పేర్కొన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవడానికి ప్రయత్నిస్తున్నాను. కాబట్టి మీడియా ముందుకు రాలేక పోతున్నాను. త్వరలో అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తా. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. సత్యమేవ జయతే.. అంటూ వినుత పేర్కొన్నారు.