Narra Ramakrishna Prasad : సంగం డెయిరీపై విషప్రచారం.. పాల ఉత్పత్తిదారులకు ఒక్క పైసా ఎగ్గొట్టలేదు : డైరెక్టర్స్
దురదృష్టవశాత్తు ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబంపై అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. ఎవరైతే ఫిర్యాదు చేశారో అతనికి అన్ని బకాయిలు చెల్లించామని తెలిపారు.

Narra Ramakrishna Prasad
Narra Ramakrishna Prasad : గత కొద్ది రోజులుగా సంగం డెయిరీపై విషప్రచారం జరుగుతుందని డైరెక్టర్ నర్రా రామకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. సంగం డెయిరీ పాల ఉత్పత్తిదారులకు ఒక్క పైసా కూడా ఎగ్గొట్టలేదని స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబంపై అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. శనివారం ఏర్పాటు చేసిన సంగం డెయిరీ డైరెక్టర్ల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరైతే ఫిర్యాదు చేశారో అతనికి అన్ని బకాయిలు చెల్లించామని తెలిపారు.
ఫిర్యాదు చేసిన వ్యక్తి గతంలో తమ అధికారులపై గొడవలు పడేవాడని వెల్లడించారు. దీని వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారని ఆరోపించారు. ముసులూరు రాము అనే వ్యక్తి బోనస్ లు సరిగా ఇవ్వలేదని గొడవలు చేశారని పేర్కొన్నారు. గతంలో పది రూపాయల బోనస్ ఇచ్చామని, ఇప్పుడు పరిస్థితిని బట్టి నాలుగు రూపాయలు బోనస్ లు ఇచ్చామని తెలిపారు.
Dhulipalla Narendra : ధూళిపాళ్ల నరేంద్రపై హత్యాయత్నం కేసు నమోదు
ధూళిపాళ్ల నరేంద్రపై కేసును ఎత్తివేయాలి : డైరెక్టర్ కంచర్ల శివరామయ్య
సంగం డెయిరీ మీద అపవాదులు వేస్తున్నారని సంగం డెయిరీ డైరెక్టర్ కంచర్ల శివరామయ్య పేర్కొన్నారు. గతంలో ఏసీబీతో దాడులు చేయించి సంగం డెయిరీని ఆక్రమించాలని ప్రభుత్వం చూసిందన్నారు. న్యాయపరంగా ఎదుర్కున్నామని తెలిపారు. రాము అనే వ్యక్తికి సంగం డెయిరీతో ఎలాంటి సంబంధం లేదన్నారు.
సంగం డెయిరీ బయట జరిగిన గొడవను బేస్ చేసుకుని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పై 307 కేసు నమోదు చేయించారని పేర్కొన్నారు. తనకు డబ్బులు రావాలంటూ గొడవ పడి ఛైర్మన్ పై అక్రమంగా కేసు నమోదు చేయించారని ఆరోపించారు.
Anil Kumar : పవర్ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ : అనిల్ కుమార్
పోలీసులు విచారించకుండా 307 సెక్షన్ క్రింద ధూళిపాళ్ల నరేంద్రపై A-14గా కేసు నమోదు చేశారని తెలిపారు. దీనిలో స్థానిక ఎమ్మెల్యే రోశయ్య హస్తం ఉందని తెలుస్తుందన్నారు. వెంటనే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పై పెట్టిన కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.