Lorry Donate : తిరుమల శ్రీవారికి విరాళంగా కూరగాయల లారీ

కర్ణాటకలోని ముళబాగల్ మాజీ శాసనసభ్యుడు జి. మంజునాథ్‌తో పాటు మరో 12 మంది కూరగాయల దాతలు రూ. 30 లక్షల విలువైన లారీని టీటీడీ ఈవో ధర్మారెడ్డికి విరాళంగా అందజేశారు.

Lorry Donate : తిరుమల శ్రీవారికి విరాళంగా కూరగాయల లారీ

Ttd

Updated On : May 22, 2022 / 7:45 PM IST

vegetable lorry : తిరుమల శ్రీవారికి బంగారం కిరీటం, కారు వంటి ఆభరణాలు, వస్తువులను విరాళంగా ఇచ్చి భక్తులు తమ భక్తిని చాటుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కూరగాయల రైతులు లారీని తిరుమల శ్రీవారికి విరాళంగా అందజేసి స్వామివారిపై ఉన్న తమ భక్తిని చాటుకున్నారు.

కర్ణాటకలోని ముళబాగల్ మాజీ శాసనసభ్యుడు జి. మంజునాథ్‌తో పాటు మరో 12 మంది కూరగాయల దాతలు రూ. 30 లక్షల విలువైన లారీని టీటీడీ ఈవో ధర్మారెడ్డికి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దాతలు లారీ తాళంచెవులను ఈవోకు అందజేశారు.

Tirumala Alert : తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యగమనిక.. వాటిపై నిషేధం, కొండపైకి అనుమతించరు

టీటీడీ అన్నప్రసాద కార్యకలాపాలకు కూరగాయలను తీసుకెళ్లేందుకు ఈ వాహనాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అన్నప్రసాదం, దాతల విభాగం డిప్యూటీ ఈవో పద్మావతి, డ్రైవింగ్ ఇన్‌స్పెక్టర్ జానకిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.