భయంతో…ఒంగోలులో మహిళా కరోనా రోగి ఆత్మహత్య

  • Published By: madhu ,Published On : September 11, 2020 / 09:39 AM IST
భయంతో…ఒంగోలులో మహిళా కరోనా రోగి ఆత్మహత్య

Updated On : September 11, 2020 / 11:09 AM IST

Rise college ongole : కరోనా వైరస్ సోకడంతో చాల మంది తీవ్ర మనస్థాపానికి, భయానికి లోనవుతున్నారు. కొంతమంది మానసిక ఆవేదనకు గురై..ప్రాణాలు తీసుకుంటున్నారు.




తాజాగా ఒంగోలులో కరోనా సోకిన మహిళ..ఆత్మహత్యకు పాల్పడింది. 4వ అంతస్థు నుంచి దూకింది. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడనే చనిపోయింది.
https://10tv.in/test-must-for-symptomatic-but-negative-covid-cases-centre-tells-states/
సంతమాగులూరు మండలం పాత మాగలూరుకు చెందిన మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెను రైజ్ కాలేజీ కరోనా ఐసోలేషన్ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అప్పటి నుంచి ఆమె చికిత్స పొందుతోంది.



కానీ..కరోనా వైరస్ సోకినప్పటి నుంచి అభద్రతా భావానికి లోనైంది. తాను చనిపోతానని మానసికంగా బాధ పడుతూ ఉండేది. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. 2020, సెప్టెంబర్ 11వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున ఐసోలేషన్ కేంద్రం 4వ అంతస్తు నుంచి అమాంతం దూకింది.



తలకు తీవ్రగాయం కావడంతో మరణించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.