Prakasam Bus Fire : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. డ్రైవర్ అప్రమత్తతతో 25 మంది ప్రయాణికుల ప్రాణాలు సేఫ్

బస్సు ఇంజన్ క్యాబిన్ లో మొదట పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

Prakasam Bus Fire : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. డ్రైవర్ అప్రమత్తతతో 25 మంది ప్రయాణికుల ప్రాణాలు సేఫ్

Private travels fire

Updated On : June 22, 2023 / 8:01 AM IST

Private Travels Bus Fire : ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం బిట్రగుంట జాతీయ రహదారిపై ఓ ప్రవేట్ ట్రావెల్ బస్సులో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. బస్సులో ముందు పొగలు రావడంతో వాటిని గమనించిన డ్రైవర్ ప్రయాణికులను దిగిపోవాలంటూ అప్రమత్తం చేశారు. ఘోర బస్సు అగ్ని ప్రమాదం తప్పింది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రాణాపాయం తప్పింది.

ప్రమాద సమయంలో బస్సులో సుమారు 25 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికుల ప్రాణాలు సేఫ్ అయ్యాయి. మోజో ట్రావెల్ బస్సు హైదరాబాద్ నుండి పాండిచ్చేరి వెళ్తుండగా మార్గంమధ్యంలో ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం బిట్రగుంట వద్ద జాతీయ రహదారిపై ఘటన చోటు చేసుకుంది.

Uttar Pradesh : యూపీలో దారుణం.. క్రికెట్ లో క్లీన్ బౌల్డ్ చేశాడని.. గ్రౌండ్ లోనే బాలుడిని చంపిన మరో బాలుడు

బస్సు ఇంజన్ క్యాబిన్ లో మొదట పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.  సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటానా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ట్రావెల్ బస్సు పూర్తిగా దగ్ధమైంది.

ప్రయాణికుల లగేజ్ మొత్తం మంటల్లో దగ్ధం అయింది. జరుగుమల్లి పోలీసులు ఇతర ట్రావెల్స్ బస్సులను రప్పించి ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు పంపించారు. ప్రయాణికుల్లో హైదరాబాద్ కు చెందిన కొంత మంది తెలుగువారు కూడా ఉన్నారు.