విజయనగరం జిల్లాలో తొలి కరోనా మరణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా అన్నీ జిల్లాలు విస్తరించినా కూడా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రం చాలా రోజుల వరకు ఎటువంటి కేసులు నమోదు కాలేదు. అయితే రెండు జిల్లాల్లో కూడా ఇటీవల కరోనా కేసులు నమోదు అయ్యాయి.
విజయనగరంలో ఇప్పటివరకు నాలుగు కరోనా పాజిటివ్ కొత్త కేసులు నమోదు అవగా.. అందులో ఒక 60ఏళ్ల వయస్సు వృద్ధురాలు ఉండగా.. ఆమె ఇవాళ(మే 10) చనిపోయింది. విజయనగరంలో జిల్లాలో కరోనాతో ఇదే తొలి మరణం. బలిజిపేట మండలం చిలకలపల్లికి చెందిన ఆమె కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది.
విశాఖలో డయాలసిస్ కోసం వచ్చిన సమయంలో ఆమెకు కరోనా సోకినట్టు భావిస్తున్నారు. విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. అయితే, ఆమె కుటుంబ సభ్యులకు కరోనా టెస్టులు చేయగా నెగెటివ్ వచ్చిందని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ప్రకటనలో తెలిపారు.