Women Employees Holidays : మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఏడాదికి ఐదు అదనపు సెలవులు

ఈ మేరకు కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ నిర్ణయంతో వీఎమ్ సీలో పనిచేస్తున్న సుమారు 3,000 మంది కార్మికులు ఏడాదికి 5 అదనపు సెలవులు పొందనున్నారు.

Women Employees Holidays : మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఏడాదికి ఐదు అదనపు సెలవులు

VMC

Updated On : June 15, 2023 / 8:49 AM IST

Vijayawada Municipal Corporation : ఏపీ ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు శుభవార్త అందించింది. విజయవాడలో మహిళా ఉద్యోగులకు ఏడాదికి 5 అదనపు సెలవులు మంజూరు చేసింది. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు, కార్మికులకు ఏడాదికి 5 అదనపు సెలవులు మంజూరయ్యాయి.

ఈ మేరకు కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ నిర్ణయంతో వీఎమ్ సీలో పనిచేస్తున్న సుమారు 3,000 మంది కార్మికులు ఏడాదికి 5 అదనపు సెలవులు పొందనున్నారు.

Chittoor Road Accident : చిత్తూరు జిల్లాలో వాహనం ఢీకొని మూడు ఏనుగులు మృతి.. రోడ్డు దాటుతుండగా ప్రమాదం

ప్రస్తుతం వీరికి ఏడాదికి 15 సాధారణ సెలవులు ఉండగా.. తాజాగా 5 అదనపు సెలవులు మంజూరయ్యాయి. మహిళా ఉద్యోగులు ఏడాదికి మొత్తం 20 సెలవులు పొందనున్నారు.