Pawan Kalyan-Amanchi Swamulu Flexi : పవన్ కళ్యాణ్ ఫొటోతో ఆమంచి కృష్ణ మోహన్ సోదరుడు ఆమంచి స్వాములు ప్లెక్సీలు
బాపట్ల జిల్లా చీరాల హైవేపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో ఉన్న చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ సోదరుడు ఆమంచి స్వాములు ప్లెక్సీలు వెలిశాయి. ఈ ప్లెక్సీలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

amanchi
Pawan Kalyan-Amanchi Swamulu Flexi : బాపట్ల జిల్లా చీరాల హైవేపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో ఉన్న చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ సోదరుడు ఆమంచి స్వాములు ప్లెక్సీలు వెలిశాయి. ఈ ప్లెక్సీలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఆమంచి సోదరుడు స్వాములు గత రెండు సంవత్సరాల నుండి పర్చూరు వైసీపీ సీటును ఆశించారు.
స్వాములును కాదని ఆమంచికి సిఎం జగన్ పర్చూరు బాధ్యతలను ఇటీవల అప్పగించారు. ఆమంచి పర్చూరుకు వెల్లిన నెలరోజుల్లోనే చీరాలలో జనసేన తరుపున ఆమంచి స్వాములు ప్లెక్సీలు వెలియడంతో స్థానిక రాజకీయాల్లో కలకలం రేపుతోంది. గతంలో పర్చూరు వైసీపీ సీటు తనకేనంటూ స్వాములు అనుచర వర్గం భారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేసింది.
ప్రస్తుత వైసీపీ అభ్యర్ధిగా చీరాల ఇంచార్జుగా కర్ణం బలరాం కుమారుడు కర్ణం వెంకటేష్ ఉన్నారు. చీరాలలో కర్ణం అడుగు పెట్టిన నాటి నుండి కర్ణం బలరాం, ఆమంచి కుటుంబాల మద్య ఆదిపత్య పోరు, తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. ప్రస్తుతం చీరాలలో జనసేన ప్లెక్సీలు వెలియడంతో రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి.