వైసీపీలో చేరిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ

కండువా కప్పి అంబటి రాయుడిని పార్టీలోకి ఆహ్వానించారు జగన్. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీ నుంచి గుంటూరు ఎంపీగా..

వైసీపీలో చేరిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ

Ambati Rayudu Joins YCP

Ambati Rayudu : మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసిన రాయుడు.. వైసీపీలో చేరారు. కండువా కప్పి అంబటి రాయుడిని పార్టీలోకి ఆహ్వానించారు జగన్. రాయుడు పొలిటికల్ ఎంట్రీకి కూడా లైన్ క్లియర్ అయ్యింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీ నుంచి గుంటూరు ఎంపీ అభ్యర్థిగా అంబటి రాయుడు బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు ఎంపీ సీటుపై రాయుడికి సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది. గుంటూరు నుంచి పోటీపై మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది. కాగా, ఇప్పటికే గుంటూరు పార్లమెంటు పరిధిలో అంబటి రాయుడు విస్తృతంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ తర్వాత అంబటి రాయుడు వైసీపీలో అధికారికంగా చేరారు. వాస్తవానికి చాలా కాలంగా వైసీపీకి అనుకూలంగా అంబటి రాయుడు వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు విస్తృతంగా పర్యటనలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా విద్యా రంగంలో సీఎం జగన్ తీసుకొచ్చిన మార్పులకు ఇంప్రెస్ అయ్యి తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు రాయుడు గతంలో ప్రకటించారు. నాడు-నేడు, స్పోర్ట్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవడం, పేద పిల్లలను పైకి తీసుకొచ్చే విషయంలో సీఎం జగన్ అత్యంత కృషి చేస్తున్నారని, ఆ విధానాలు నచ్చి తాను రాజకీయాల్లోకి వస్తున్నానని, జగన్ కు మద్దతుగా నిలుస్తానని గతంలో అంబటి రాయుడు చెప్పారు.

Also Read : పవన్ కల్యాణ్ వేట.. గెలుపు గుర్రాల ఎంపిక కోసం స్వయంగా రంగంలోకి, ముందుగా అక్కడి నుంచే

ఇప్పటికే రెండుసార్లు జగన్ ను కలిశారు రాయుడు. ఏపీలో స్పోర్ట్స్ కు సంబంధించి డెవలప్ మెంట్ ఏ విధంగా చేయాలి అనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వానికి సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని రాయుడు ఇదివరకే నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే గుంటూరు పార్లమెంటు పరిధిలో ప్రభుత్వ కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాల్లో వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్నారు.

Also Read : నారా లోకేశ్‌తో వట్టి పవన్ భేటీ.. ఉంగుటూరు సీటు కోసమేనా?

అంతేకాదు జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు. ఇక, గుంటూరు ఎంపీగా అంబటి రాయుడు పోటీ చేయనున్నట్లు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో గుంటూరు ఎంపీ స్థానాన్ని వైసీపీ కోల్పోయింది. అక్కడ టీడీపీ ఎంపీ గెలిచారు. 2024 ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా గుంటూరు ఎంపీ స్థానాన్ని తన ఖాతాలో వేసుకోవాలని వైసీపీ పట్టుదలగా ఉంది. ఇందులో భాగంగానే అంబటి రాయుడికి ఎంపీ టికెట్ ఇచ్చి కచ్చితంగా గెలిపించాలని పార్టీ నేతలకు సీఎం జగన్ చెప్పినట్లుగా సమాచారం.