Anil Kumar Yadav: నెల్లూరు జిల్లాలో మరోసారి క్లీన్‌స్వీప్ చేయబోతున్నాం.. మహిళాశక్తి పేరుతో టీడీపీ డ్రామాలు ..
మహిళా శక్తి పేరుతో టీడీపీ డ్రామాలు చేస్తుంది. టీడీపీ నేత ఇంట్లో మనిషి వారం రోజుల నుంచి తన ఆర్తనాదాన్ని చెప్పుకుంటుంటే టీడీపీ, జనసేన నాయకులు కనీసo స్పందించడం లేదు.

Former minister Anil Kumar Yadav
YCP MLA Anil Kumar Yadav: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టీడీపీకి ఘోర పరాభవం తప్పదు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగురుతుంది. టీడీపీకి గుండు సున్నా ఖాయమని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జోస్యం చెప్పారు. చంద్రబాబు నెల్లూరుకు ఎప్పుడు వచ్చారో, ఎప్పుడు వెళ్లిపోయారో కూడా ప్రజలకు తెలియదు. అయినా, నెల్లూరు జిల్లాలో టీడీపీకి కాలం చెల్లించింది. ఆ పార్టీని పట్టించుకునేవారు లేరు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా మారిపోయిందని అనిల్ కుమార్ అన్నారు. మరోసారి నెల్లూరు జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేయబోతున్నాం. టీడీపీకి గుండు సున్నా ఖాయమని అన్నారు.
నాలుగు దిక్కుల్లో ఒక్కో దిక్కు నుంచి ఎంతమంది కలిసి వచ్చినా జగన్ మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఈసారి ప్రజలు ఒక్కొక్కరిని ఒక్కొక్క దిక్కున పంపిస్తారంటూ ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరిన నేతలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. మహిళా శక్తి పేరుతో టీడీపీ డ్రామాలు చేస్తుంది. టీడీపీ నేత ఇంట్లో మనిషి వారం రోజుల నుంచి తన ఆర్తనాదాన్ని చెప్పుకుంటుంటే టీడీపీ, జనసేన నాయకులు కనీసo స్పందించడం లేదు. ఆ నేత ఇంట్లో ఆడవారికే రక్షణ లేకుంటే ఇక బయట వారికి ఏముంటుంది? అంటూ అనిల్ ప్రశ్నించారు.
మహిళా శక్తి పేరుతో మీకు అండగా ఉంటామని టీడీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. 2024లో జగన్ మోహన్ రెడ్డి మరోసా సీఎం అవుతారని, చంద్రబాబునాయుడు ఇంటికి వెళ్లడం ఖాయమని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.