Ganta Srinivasa Rao : చంద్రబాబు అరెస్ట్ అతి పెద్ద తప్పు.. వైసీపీ మరణ శాసనం తానే రాసుకుంది : గంటా శ్రీనివాసరావు

టీడీపీ, జనసేన కూటమిని చూసి వైసీపీ కంటగింపుగా ఉందని విమర్శించారు. ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలు రాష్ట్రంలో ఏ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ లో అవినీతి జరిగిందో చూపించాలన్నారు.

Ganta Srinivasa Rao : చంద్రబాబు అరెస్ట్ అతి పెద్ద తప్పు.. వైసీపీ మరణ శాసనం తానే రాసుకుంది : గంటా శ్రీనివాసరావు

Former minister Ganta Srinivasa Rao

Updated On : October 6, 2023 / 1:40 PM IST

Ganta Srinivasa Rao Challenge YCP : వైసీపీపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ వైసీపీ చేసిన అతి పెద్ద తప్పు అని పేర్కొన్నారు. వైసీపీ మరణ శాసనం తనకు తానే రాసుకుందన్నారు. వైసీపీ దుకాణం బంద్ అయ్యిందని ఎద్దేవా చేశారు. రాబోయేది టీడీపీ, జనసేన కూటమిదే విజయం ధీమా వ్యక్తం చేశారు. విశాఖ నక్కవాని పాలెంలో చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. గంటా శ్రీనివాసరావు నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

వైసీపీది తాత్కాలికంగా పై చేయి కావచ్చు, మసి పూసి మారేడు కాయ చేయచ్చు కానీ, నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు. టీడీపీ, జనసేన కూటమిని చూసి వైసీపీ కంటగింపుగా ఉందని విమర్శించారు.
ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలు రాష్ట్రంలో ఏ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ లో అవినీతి జరిగిందో చూపించాలన్నారు. రాష్ట్రంలో ఏ సెంటర్ నైనా చూపించండి, అక్కడకు వచ్చి నిరూపిస్తానని సవాల్ చేశారు.

Minister KTR : ఏపీలో జగనన్నకు చెప్పి జాగా ఇప్పిస్తా : కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

తాను హెచ్ ఆర్ డీ మంత్రిగా ఉన్నప్పుడే ఆరుగురు ఐఏఎస్ అధికారుల బృందాన్ని గుజరాత్ పంపామని తెలిపారు. అక్కడి విధానాన్ని ఇక్కడ అమలు చేశామని పేర్కొన్నారు. మొదట్లో రూ.371 కోట్ల అక్రమం జరిగిందన్నారు, ఇప్పుడు రూ.27 కోట్ల అక్రమం జరిగిందని అంటున్నారని వెల్లడించారు.

పార్టీ ఎలెక్ట్రోల్ బాండ్లను కూడా లంచం, అవినీతి అంటున్నారని పేర్కొన్నారు. ఇదే స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లపై అవార్డు తెచ్చుకుని పబ్లిసిటీ తెచ్చుకున్నారని విమర్శించారు. కష్ట కాలంలో అండగా నిలిచిన మిత్రుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. ఎవరికి ఎన్ని సీట్లో అది తమ అంతర్గత వ్యవహారంగా పేర్కొన్నారు.