మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టెండర్లు లేకుండా ఇరిగేషన్ పనులు ప్రారంభించారన్న

Kakani Govardhan Reddy
Kakani Govardhan Reddy: మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టెండర్లు లేకుండా ఇరిగేషన్ పనులు ప్రారంభించారన్న నేపథ్యంలో పొదలకూరు మండలం సంగెం, సూరాయపాళెం కనుపూరు కాలువ పరిశీలనకు గోవర్ధన్ రెడ్డి బయలుదేరారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. తమకు సహకరించాలని వెంకటాచలం, వేదాయపాలెం పోలీసులు కోరారు.
Also Read : అందుకే, ఆయన అలా అన్నారు- పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత రియాక్షన్..
అయితే, ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు గోవర్ధన్ రెడ్డి నివాసంకు పెద్ద సంఖ్యలో చేరుకొని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. వైసీపీ ప్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు చించివేయడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు ఉద్రిక్తత పరిస్థితి తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో భారీగా పోలీసులను మోహరించారు.