Chandrababu Naidu : చంద్రబాబుకు దాసరి బాలవర్ధనరావు స్వాగత ఫ్లెక్సీలు .. బాబు పర్యటనతో మారుతున్న కృష్ణాజిల్లా రాజకీయ పరిణామాలు

అప్పుడు టీడీపీ షాకిచ్చారు. ఇప్పుడు వైసీపీ షాక్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే. చంద్రబాబుకు స్వాగతం పలుకుతు దాసరి బాలవర్ధనరావు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీతో కృష్ణా జిల్లా రాజకీయ పరిణామాలు మారుతున్నాయా? అనిపిస్తోంది..

Chandrababu Naidu : చంద్రబాబుకు దాసరి బాలవర్ధనరావు స్వాగత ఫ్లెక్సీలు .. బాబు పర్యటనతో మారుతున్న కృష్ణాజిల్లా రాజకీయ పరిణామాలు

Dasari Balavardhana Rao Welcome to Chandrababu Naidu

Updated On : April 14, 2023 / 12:57 PM IST

Chandrababu Naidu : కృష్ణా జిల్లాలో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్న సందర్భంగా కృష్ణా జిల్లాలోలో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. గతంలో టీడీపీకి షాక్ ఇచ్చి వైసీపీలోకి వెళ్లిన నేతలు తిరిగి టీడీపీవైపు మొగ్గుచూపుతున్నారనేలా మారిపోతున్నాయి పరిణామాలు చంద్రబాబు పర్యటనతో. మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్థనరావు చంద్రబాబుకు స్వాగతం పలుకుతు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో కృష్ణా జిల్లాలో రాజకీయ పరిణామాల్లో మార్పు వచ్చినట్లుగా తెలుస్తోంది. 2019లో టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ అయినా దాసరి బాలవర్థనరావు ఇప్పుడు తిరిగి టీడీపీలోకి రాబోతున్నారనేదానికి సంకేతంగా చంద్రబాబుకు స్వాగతం పలుకుతు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అద్దం పడుతోంది.

2019లో టీడీపీ నుంచి వైసీపీలో చేరారు దాసరి సోదరులు చంద్రబాబుకు స్వాగతం పలుకుతు ఏర్పాటు చేసిన ఫెక్సీ స్థానికంగా సంచలనం కలిగిస్తోంది. ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన సందర్భంగా దాసరి బాలవర్ధనరావు మాట్లాడుతు..ఎన్టీఆర్ కుటుంబంతో మాకు మంచి అనుబంధం ఉందని..కానీ మాకు వైసీపీలో సభ్యత్వం కూడా లేదని తెలిపారు. కాగా..టీడీపీలో ఇబ్బందులు పడలేక వైసీపీలో చేరానని అప్పట్లో చెప్పిన బాలవర్థన్‌రావు తిరిగి టీడీపీవైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.

Lokesh Yuvgalam Padayatra : హ్యాట్సాఫ్ లోకేష్ .. నువ్వు గొప్ప నాయకుడవు అవుతావు : జేసీ ప్రభాకర్ రెడ్డి

దాసరి బాలవర్థన్‌రావు 1994లో గన్నవరం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తర్వాత 1999లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో మళ్లీ ఓడిన ఆయన 2009లో విజయం సాధించారు. 2014లో వల్లభనేని వంశీ ఎంట్రీతో బాలవర్థన్‌రావుకు టికెట్ దక్కలేదు. దీంతో పోటీ నుంచి తప్పుకున్నారు. టికెట్ రాకపోయినా.. టీడీపీలో కొనసాగుతూ కృష్ణాజిల్లా విజయ డెయిరీ డైరెక్టర్‌‌గా ఉన్నారు. అలా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటు 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు.