వైసీపీలో విషాదం.. కరోనాతో మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్‌సీపీలో విషాదం నెలకొంది. ఆ పార్టీ జిల్లా కీలక నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి కన్నుమూశారు. కొద్దిరోజుల కిందట కరోనా బారిన పడిన

వైసీపీలో విషాదం.. కరోనాతో మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

Former Mla Kudupudi Chittabbai Passed Away

Updated On : April 29, 2021 / 12:20 PM IST

former mla kudupudi chittabbai : తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో విషాదం నెలకొంది. ఆ పార్టీ జిల్లా కీలక నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి కన్నుమూశారు. కొద్దిరోజుల కిందట కరోనా బారిన పడిన ఆయన కాకినాడ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. చిట్టబ్బాయి మృతితో వైసీపీ నాయకులు సహా బీసీ నేతలు విషాదంలో మునిగిపోయారు.

చిట్టబ్బాయి కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. కాగా చిట్టబ్బాయి తూర్పుగోదావరి జిల్లా అమలాపురం అసెంబ్లీ స్థానానికి 2004లో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించారు.. అయితే టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీచేసి విజయం సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం వైసీపీలో చేరారు.. ప్రస్తుతం ఆ పార్టీ బీసీ విభాగంలో కీలకనేతగా కోనసాగుతున్నారు.