Corona Deaths : కరోనాతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి

ఏపీ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో రికార్డవుతున్నాయి. తాజాగా ఒకే కుటుంబంలో కరోనాతో నలుగురు మృతి చెందారు. విజయవాడకు చెందిన న్యాయవాది కుటుంబంలో విషాదం నెలకొంది.

Corona Deaths : కరోనాతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి

Corona Deaths

Updated On : April 20, 2021 / 3:04 PM IST

Four died with Corona in the same family : ఏపీ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో రికార్డవుతున్నాయి. తాజాగా ఒకే కుటుంబంలో కరోనాతో నలుగురు మృతి చెందారు. విజయవాడకు చెందిన న్యాయవాది కుటుంబంలో విషాదం నెలకొంది. కరోనాతో పాతబస్తీకి చెందిన న్యాయవాది దినేశ్ మృతి చెందారు. తెల్లవారుజామున ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దినేశ్ తండ్రి మృతి చెందారు. మూడు రోజుల క్రితం దినేష్ తల్లి, బాబాయ్ కరోనాతో మృతి చెందారు.

నిన్న 5 వేల 963 మందికి కరోనా సోకింది. 27 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 37 వేల 765 శాంపిల్స్ పరీక్షించారు. కృష్ణాలో ఆరుగురు, చిత్తూరులో నలుగురు, నెల్లూరులో నలుగురు, గుంటూరు, వైఎస్ఆర్ కడప, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్టణంలో ఇద్దరు చొప్పున, అనంతపూర్ లో ఒక్కరు మరణించారు.

నిన్నటి వరకు 2 వేల 569 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. మొత్తంగా రాష్ట్రంలో 1,57,15,757 శాంపిల్స్ పరీక్షించారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 9 లక్షల 65 వేల 105 పాజిటివ్ కేసులకు గాను..9 లక్షల 09 వేల 615 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఈ వైరస్ కారణంగా…7 వేల 437 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 48 వేల 053గా ఉంది.