Vijayasai Reddy: వైకాపా హయాంలో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాం

ఏపీలో వై.ఎస్. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నాలుగు లక్షల ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ఇచ్చామని వైకాపా నేత విజయ్ సాయి రెడ్డి అన్నారు. జగన్ ఆదేశాల మేరకు జాబ్ మేళా...

Vijayasai Reddy: వైకాపా హయాంలో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాం

Vijay Sai Reddy

Updated On : April 27, 2022 / 2:24 PM IST

Vijayasai Reddy: ఏపీలో వై.ఎస్. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నాలుగు లక్షల ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ఇచ్చామని వైకాపా నేత, రాజ్యసభ సభ్యులు విజయ్ సాయి రెడ్డి అన్నారు. జగన్ ఆదేశాల మేరకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు విశాఖ, తిరుపతిలో జాబ్ మేళా నిర్వహించామని తెలిపారు. మే 7, 8 తేదీల్లో గుంటూరు నాగార్జున యూనివర్శిటీలో నిర్వహిస్తున్నామని విజయసాయి రెడ్డి తెలిపారు. గత రెండు సెంటర్స్ లో 30వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని, ఈ 30వేల ఉద్యోగాల్లో 15వేల సాలరీ నుండి లక్ష సాలరీ వరకు ఉన్నాయని అన్నారు.

MP Vijay Saireddy : పరిశ్రమలకు ఏపీ అనుకూలమైన రాష్ట్రం: ఎంపీ విజయసాయి రెడ్డి

నాగార్జున యూనివర్శిటీలో జరిగే జాబ్ మేళాలో 77వేల మంది రిజిస్టర్ చేసుకున్నారని, 140 కంపెనీలు ఈ జాబ్ మేళాకు రానున్నట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న నాటి నుండి నాలుగు లక్షల ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు. ఇప్పుడు ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగాలు ఇచ్చేలా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలో చిట్టచివరి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చే వరకూ ఇది జరుగుతూనే ఉంటుందని విజయ సాయి రెడ్డి స్పష్టం చేశారు.