School Bus Accident : బస్సు కిందపడి నాలుగేళ్ళ బాలుడు మృతి

కృష్ణా జిల్లాలో విషాదఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ళ బాలుడు స్కూల్ బస్సు కిందపడి మృతి చెందాడు.

School Bus Accident : బస్సు కిందపడి నాలుగేళ్ళ బాలుడు మృతి

Road Accident

Updated On : December 14, 2021 / 11:33 AM IST

School Bus Accident :కృష్ణా జిల్లాలో విషాదఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ళ బాలుడు దినేష్ స్కూల్ బస్సు పడిపోయాడు. ఈ ప్రమాదంలో దినేష్ అక్కడికక్కడే మృతి చెందగా శరీరం ఛిద్రమై గుర్తుపట్టలేకుండా మారిపోయింది. అవనిగడ్డ మండలం కోడూరు గ్రామంలోని ఆరవ వార్డులో ఈ ఘటన జరిగింది. అప్పటివరకు ఇంట్లో ఆడుకున్న దినేష్ క్షణాల్లో మృతి చెందటం అక్కడివారిని తీవ్ర విషాదంలో ముంచింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. బాలుడి మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

చదవండి : Road Accident : మద్యంమత్తు.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు