ఏపీలో భారీ పెట్టుబడులకు ఫాక్స్‌కాన్ సంసిద్ధత..!

ప్రజా ప్రభుత్వంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ లక్ష్య సాధనలో ఫాక్స్ కాన్ ప్రధాన భూమిక పోషించాలి.

ఏపీలో భారీ పెట్టుబడులకు ఫాక్స్‌కాన్ సంసిద్ధత..!

Foxconn Investments (Photo Credit : Facebook)

Foxconn Investments : ఏపీలో భారీ పెట్టుబడులకు ఫాక్స్‌కాన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఎలక్ట్రానిక్ వాహనాలు, సెమీ కండక్టర్లు, డిజిటల్ హెల్త్, మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్స్ తయారీకి సంబంధించిన ప్లాంట్ల ఏర్పాటుకు సుముఖంగా ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు కల్పించేందుకు ఫాక్స్ కాన్ ప్రతినిధులు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. ఫాక్స్ కాన్ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ నిర్మాణం చేయాలని కంపెనీ ప్రతినిధులను కోరారు ఏపీ మంత్రి నారా లోకేశ్. ఫాక్స్ కాన్ కంపెనీ ప్రతినిధులకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను మంత్రి లోకేశ్ వివరించారు.

ఉండవల్లి నివాసానికి వచ్చిన ఫాక్స్ కాన్ బృందానికి లోకేశ్ స్వాగతం పలికారు. త్వరలోనే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈవీ, ఎలక్ట్రానిక్ పాలసీలు తీసుకురాబోతున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పరిశ్రమలకు రాయితీలు కల్పించే విధానం కూడా రూపొందిస్తున్నామన్నారు. 2014 నుండి 2019 వరకూ రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడానికి తీసుకున్న చర్యలు, తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్స్, ఈవీ పాలసీల గురించి వివరించారు లోకేశ్. ఫాక్స్ కాన్ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేశ్ కోరారు. ఈ మేరకు
ఫాక్స్ కాన్ ప్రతినిధులతో నారా లోకేశ్ చర్చలు జరిపారు.

”సీఎం చంద్రబాబు చొరవతో 2014 నుండి 2019 వరకు వచ్చిన అనేక కంపెనీల్లో ఫాక్స్ కాన్ కూడా ఒకటి. ఫాక్స్ కాన్ ఇండియా తన కార్యకలాపాలను విస్తరించాలని చూస్తోంది. ఫాక్స్ కాన్ మెగా సిటీ ఏర్పాటుకు అవసరమైన పూర్తి సహకారం మేము అందిస్తాo. ప్రజా ప్రభుత్వంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ లక్ష్య సాధనలో ఫాక్స్ కాన్ ప్రధాన భూమిక పోషించాలి. అనుమతుల నుండి ఉత్పత్తి వరకూ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తరపున సహకారం అందిస్తాo. ఎలాంటి సహకారం కావాలన్నా నేనే స్వయంగా రంగంలోకి దిగుతా. ఫాక్స్‌కాన్ మెగా సిటీ ఏర్పాటుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తాo.

ఫాక్స్‌కాన్ కంపెనీ ఇండియన్ రిప్రజెంటేటివ్ వి.లీ..
ఏపీలో గత ఐదేళ్లలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాo. ప్రపంచవ్యాప్తంగా మాకు అనేక ప్లాంట్లు ఉన్నాయి. ఇండియాలో భారీ ఎత్తున కార్యకలాపాలు విస్తరించే ఆలోచనలో ఉన్నాo. 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యానికి మా వంతు సహకారం అందిస్తాం.

Also Read : అందుకే ఎక్కడ చూసినా రికార్డులు తగలబెడుతున్నారు: మంత్రి అచ్చెన్నాయుడు