Ponnavolu Sudhakar Reddy : జైల్లో చంద్రబాబు ఉండే చోటుని కోటలా మార్చేశాం, ఓ రేంజ్‌లో భద్రత కల్పించాం, చంద్రబాబు సెక్యూరిటీ మా ప్రభుత్వం బాధ్యత- ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి

ఒకవేళ ఏదైనా పొరపాట్లు జరిగితే ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. అది దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన సెక్యూరిటీ కల్పించాము. Ponnavolu Sudhakar Reddy

Ponnavolu Sudhakar Reddy : జైల్లో చంద్రబాబు ఉండే చోటుని కోటలా మార్చేశాం, ఓ రేంజ్‌లో భద్రత కల్పించాం, చంద్రబాబు సెక్యూరిటీ మా ప్రభుత్వం బాధ్యత- ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి

Ponnavolu Sudhakar Reddy (Photo : Google)

Updated On : September 12, 2023 / 7:07 PM IST

Chandrababu Arrest : చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ ను కొట్టివేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు అనంతరం సీఐడీ తరపు న్యాయవాది, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ ఎందుకు వేశారు? చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ ను కోర్టు ఎందుకు తిరస్కరించింది? రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకి ఏ విధమైన భద్రత కల్పించారు? హౌస్ రిమాండ్ పిటిషన్ వ్యవహారంలో సీఐడీ వినిపించిన వాదనలు ఏంటి? ఈ అంశాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి.

రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకి కనీవిని ఎరుగని రీతిలో భద్రత కల్పించినట్లు పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. జైల్లో చంద్రబాబు ఉన్న చోటుని ఓ కోటలా మార్చేశారని ఆయన వెల్లడించారు. చంద్రబాబు సెక్యూరిటీ మా ప్రభుత్వం బాధ్యత, కర్తవ్యం అని ఆయన స్పష్టం చేశారు. జైల్లో చంద్రబాబుకి కల్పించిన భద్రత విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు, ఆందోళన అవసరం లేదన్నారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి.

”రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకి పూర్తి భద్రత ఉంది. ఇంటి నుంచి ఆహారం, అవసరమైన మందులు అందుతున్నాయి. చంద్రబాబు విన్నపాలన్నీ పరిగణలోకి తీసుకున్నాం. ఆయన బ్యారక్ చుట్టూ హైసెక్యూరిటీ ఉంది. జైలు పరిసరాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. చంద్రబాబు ఉండే ప్రదేశాన్ని ఓ కోటగా మార్చేశాం. ఇంటి కంటే జైల్లోనే భద్రంగా ఉంటారు. మేము చేసిన ఈ వాదనలను పరిగణలోకి తీసుకుని ఏకీభవించిన కోర్టు చంద్రబాబు హౌస్ రిమాండ్ కు అనుమతి ఇవ్వలేదు” అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వివరించారు.

Also Read..TDP Crisis : టీడీపీని నడిపించే నాయకుడు ఎవరు? చంద్రబాబు అరెస్ట్‌తో క్లిష్ట పరిస్థితుల్లో తెలుగుదేశం, పార్టీ చరిత్రలో ఎన్నడూ చూడని గడ్డుకాలం

”67 సీఆర్పీసీ ప్రకారం రెండు కస్టడీలు మాత్రమే ఉన్నాయి. ఒకటి జ్యుడీషియల్ కస్టడీ, రెండు పోలీస్ కస్టడీ. సీఆర్పీసీ చట్టంలో మూడో రకమైన కస్టడీ లేదు. అది మా ప్రధానమైన వాదన. హౌస్ రిమాండ్ పిటిషన్ పై తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. హౌస్ కస్టడీకి ఇవ్వాల్సిన కారణాలు ఏం చెప్పారంటే.. చంద్రబాబుకి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రాణహాని ఉందన్నారు. కావాల్సినంత సెక్యూరిటీ ఉండదు అన్నది వారి అభిప్రాయం, అనుమానం.

చంద్రబాబుని ఆయన ఇంట్లోనే పెట్టి సెక్యూరిటీ ఇవ్వాలని కోరారు. రెండో పిటిషన్ ఏంటంటే.. చంద్రబాబుకి ఆరోగ్యం బాగోలేదని, మందులు ఇవ్వాలని, వారికి ఇంటి నుంచి తయారు చేసిన ఆహారం వారికి అనుమతించాలని న్యాయమూర్తిని అడిగారు. ప్రభుత్వం మానవీయకోణంతో స్పందించింది. చంద్రబాబుకి మందులు ఇవ్వాలని, ఇంట్లో తయారు చేసిన ఆహారం జైలుకి పంపించాలని ప్రభుత్వం పెద్ద హృదయంతో అంగీకారం తెలిపింది. దీనికి ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం తెలపలేదు.

రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకి తగినటువంటి సెక్యూరిటీ ఉండదనేది వారి ప్రధానమైన అనుమానం. మేము వెంటనే రాజమండ్రి డీజీ ప్రిజన్స్ కి లెటర్ అడిగాము. జైల్లో చంద్రబాబుకి ఏ విధమైన సెక్యూరిటీ మీరు ప్రొవైడ్ చేస్తున్నారో చెప్పాలన్నాం. డీజీ ప్రిజన్స్ మాకు ఒక లెటర్ పంపారు. జైల్లో చంద్రబాబు ఉండే ప్రదేశం ఒక కోటలా తయారైంది. ఒక బ్యారెక్స్ బ్యారెక్స్ మొత్తం చంద్రబాబుకి కేటాయించారు.

Also Read..Pawan Kalyan: పవన్ కల్యాణ్ కన్ఫూజన్‌లో ఉన్నారా?

శానిటైజ్ చేసి, సీసీ కెమెరాలు అమర్చారు. 24/7 ఆర్డ్మ్ గార్డ్స్ ను ఆ పరిసరాల్లో ఉంచారు. ఇతర ఏ ఖైదీ కూడా చంద్రబాబు ఉన్న బ్యారెక్స్ దగ్గరికి వచ్చే అవకాశం లేకుండా చేశారు. ఆ రేంజ్ లో వసతులు కల్పించారు. మెడికల్ ఫెసిలిటీ కూడా రౌండ్ ద క్లాక్ చంద్రబాబు ఉండే బ్యారెక్స్ పక్కనే పెట్టారు. ఇంతవరకు నేను ఎక్కడా వినలేదు. ఆ రేంజ్ లో ఒక ఖైదీకి ప్రభుత్వం సెక్యూరిటీ ఇచ్చింది. చంద్రబాబు సెక్యూరిటీని ప్రభుత్వం తన బాధ్యతగా తీసుకుంది. తన కర్తవ్యంగా భావించింది.

క్షణాల్లో మొత్తం శానిటైజ్ చేసేశారు. చంద్రబాబు ఉండే ప్రదేశం కోట గోడలా మార్చారు. దుర్భేద్యమైన కోట. చంద్రబాబు సెక్యూరిటీకి ఎలాంటి ఇబ్బంది లేదు. అదే ప్రైవేట్ హౌస్ లో పెడితే.. ఇంత సెక్యూరిటీ ఉండదు. కోటలా ఉండదు. ఒక ప్రైవేట్ గృహంలో చంద్రబాబు ఉంటే కచ్చితంగా ఆయనకు సెక్యూరిటీ థ్రెట్ ఎక్కువ అవుతుంది. ఇది ప్రభుత్వ బాధ్యత.

ఒకవేళ ఏదైనా పొరపాట్లు జరిగితే ప్రభుత్వమే ఫైనల్ గా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. అది దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన సెక్యూరిటీ కల్పించాము. మా వాదనలను కోర్టు పరిగణలోకి తీసుకుంది. ప్రైవేట్ హౌస్ లో కన్నా జైల్లోనే సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుందని కోర్టు కూడా భావించింది. కేంద్ర, రాష్ట్ర గైడ్ లైన్స్ ప్రకారం జైల్లో చంద్రబాబుకి సెక్యూరిటీ ఇచ్చారు. చీమ చిటుక్కుమనే పరిస్థితి కూడా లేదు” అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వెల్లడించారు.