Genome Sequencing Labs : ఏపీలో త్వరలో జీనోమ్‌ స్వీక్వెన్సింగ్‌ ల్యాబ్‌

దేశంలో ఒమిక్రాన్ ప్రభావం పెరిగే అవకాశం ఉందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు 23 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Genome Sequencing Labs : ఏపీలో త్వరలో జీనోమ్‌ స్వీక్వెన్సింగ్‌ ల్యాబ్‌

Genome Sequencing Labs

Updated On : December 10, 2021 / 10:59 AM IST

Genome Sequencing Labs : దేశంలో ఒమిక్రాన్ ప్రభావం పెరిగే అవకాశం ఉందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు 23 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఓ వ్యక్తి ఈ మ్యుటెంట్ నుంచి కోలుకొని ఇంటికివెళ్ళారు. ఇక ఈ వైరస్ ను గుర్తించేందుకు జీనోమ్‌ స్వీక్వెన్సింగ్‌ చెయ్యాల్సి ఉంటుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో మాత్రమే ఈ జీనోమ్‌ స్వీక్వెన్సింగ్‌ ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయి. దీంతో కొన్ని రాష్ట్రాలు పరీక్షల కోసం తమ సరిహద్దులు దాటాల్సి వస్తుంది.

చదవండి : Biden On Omicron : శుభవార్త ఉంది..ఒమిక్రాన్ టెన్షన్ వేళ బైడెన్ కీలక వ్యాఖ్యలు

ఇక ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాలు సొంతంగా జీనోమ్‌ స్వీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం జీనోమ్‌ స్వీక్వెన్సింగ్‌ ల్యాబ్ ఏర్పాటు సిద్ధమైంది. విజయవాడలో ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యూలర్‌ బయాలజీ (సీసీఎంబీ)తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 15 శాతం నమూనాలను వైరస్ జన్యుక్రమాన్ని గుర్తించేందుకు హైదరాబాద్ ల్యాబ్ కు పంపిస్తున్నారు. అయితే పరీక్షల ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం జరుగుతుంది.

చదవండి : Omicron effect on World: ఒమిక్రాన్‌తో డోన్ట్ వర్రీ..!

రాష్ట్రంలో ల్యాబ్ ఏర్పాటు చేసుకుంటే ఇలాంటి సమస్య ఉండదని భావించిన ప్రభుత్వం ల్యాబ్ ఏర్పాటుకు సీసీఎంబీతో మాట్లాడి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు విజయవాడలో వచ్చే వారంలో ల్యాబ్‌లో కార్యకలాలపాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ తెలిపారు. ల్యాబ్‌లోపని చేసే వైద్య సిబ్బందికి హైదరాబాద్‌లో శిక్షణ ఇప్పించామని ఆయన తెలిపారు.

చదవండి : Omicron effect on World: ఒమిక్రాన్‌తో డోన్ట్ వర్రీ..!