Omicron Threat : 57 దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్‌..!

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. దేశాల సరిహద్దులే కాదు ఖండాలు కూడా దాటేస్తు ఇప్పటికే 57 దేశాలకు వ్యాపించింది.

Omicron Threat : 57 దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్‌..!

Covid 19 New Variant Omicron

Omicron variant spread over 57 countries : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. దేశాల సరిహద్దులే కాదు ఖండాలు కూడా దాటేస్తు ఇప్పటికే 57 దేశాలకు వ్యాపించేసింది. దీంతో కరోనా భయం ఇప్పుడిప్పుడే తగ్గుతున్న క్రమంలో ఈ ఒమిక్రాన్ గుబులు పుట్టిస్తోంది. మరోసారి ప్రపంచ దేశాలను భయాందోళన గురి చేస్తోంది.

Read more : Nairobi prison fire : బురిండి జైలులో భారీ అగ్నిప్రమాదం.. 38 మంది ఖైదీల సజీవ దహనం

డెల్టా వేరియంట్‌తోనే తలమునకలైన ప్రపంచ దేశాలకు ఇప్పుడు ఒమిక్రాన్‌ వల్ల వణుకుతున్నాయి. కరోనా వ్యాప్తి కంటే డెల్టా వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తే దాని కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోంది ఒమిక్రాన్‌. సౌతాఫ్రికాలో కొన్ని రోజుల క్రితమే వెలుగు చూసిన ఈ ఒమిక్రాన్ అంతర్జాతీయ ప్రయాణాల ద్వారా ఇప్పటికే 57 దేశాలకు వ్యాపించిపోయింది. ఈక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా 1,701 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.

బ్రిటన్ లో 437, డెన్మార్క్‌లో 398, దక్షిణాఫ్రికాలో 255, యూఎస్‌లో 50, జింబాబ్వేలో 50, భారత్‌లో 23తో పాటు మరికొన్ని దేశాల్లో ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఈక్రమంలో భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఆయా దేశాలు ఒమిక్రాన్‌ వ్యాప్తిని అరికట్టేందుకు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించారు.

Read more : Corona Cases : దేశంలో పెరిగిన కరోనా కేసులు.. వేగంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ

ఒమిక్రాన్ భయంతో చోట్ల మరోసారి లాక్‌డౌన్‌ను కూడా విధించగా..మరికొన్ని దేశాలు లాక్‌డౌన్‌ విధించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. భారత్‌లో కూడా 23 ఒమిక్రాన్ కేసులు రావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు నిర్వహించే కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది.