Omicron Variant : ఒమిక్రాన్ ముప్పు… డబ్ల్యూహెచ్ఓ తాజా వార్నింగ్

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ తాజా వార్నింగ్ ఇచ్చారు. ఒమిక్రాన్ తన గమనాన్ని మార్చగలదని..

Omicron Variant : ఒమిక్రాన్ ముప్పు… డబ్ల్యూహెచ్ఓ తాజా వార్నింగ్

Omicron Variant

Omicron Variant : యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ తాజా వార్నింగ్ ఇచ్చారు. ఒమిక్రాన్ తన గమనాన్ని మార్చగలదని ఆయన తెలిపారు.

వేగంగా వ్యాప్తి చెందే లక్షణం, అసాధారణ మ్యుటేషన్లు కలిగిన ఒమిక్రాన్… భారీ ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు. డెల్టా కంటే స్వల్ప లక్షణాలే ఉన్నట్లు తెలుస్తోందని.. అయినా, ఇప్పుడే ఓ అభిప్రాయానికి రావడం తొందరపాటే అవుతుందని చెప్పారు. వీలైనంత ఎక్కువ మందికి టీకాలు ఇవ్వడం, కట్టడి చర్యల వల్ల సంక్షోభం నుంచి తప్పించుకోవచ్చన్నారు.

”ఒమిక్రాన్ వేరియంట్ కరోనావైరస్ మహమ్మారి గమనాన్ని మార్చగలదు. ఒమిక్రాన్ వేరియంట్ మ్యుటేషన్లే అందుకు కారణం. ప్రపంచ దేశాలు వీలైనంత త్వరగా టీకాలు వేయాలి. ఒమిక్రాన్.. ప్రపంచ సంక్షోభంగా మారడాన్ని మనము నిరోధించగలం. ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ మారుతోంది. కానీ, మన సామూహిక సంకల్పం మారకూడదు” అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అన్నారు.

iPhone 13 Mini: ఐఫోన్‌పై నెవర్ బిఫోర్ ఆఫర్.. రూ.36వేలు డిస్కౌంట్

కరోనా మహమ్మారి వెలుగు చూసి.. దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. ఈ రెండేళ్ల కాలంలో అనేక కొత్త వేరియంట్లు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేశాయి. నిన్నమొన్నటి దాకా అత్యంత ప్రమాదకారిగా డెల్టా వేరియంట్‌ వణికించింది. ఇప్పుడు డెల్టా వేరియంట్‌ ను తలదన్నే.. ఒమిక్రాన్‌ అనే మరో వేరియంట్‌ బెంబేలెత్తిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టి… సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో… కొత్త వేరియంట్ భయబ్రాంతులకు గురి చేస్తోంది.

గతంలో వచ్చిన వేరియంట్ల కంటే ఇది ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో అనేక దేశాలు మళ్లీ ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోయాయి. చాలా దేశాలు ఇప్పటికే విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి.

Amazon Prime: డిసెంబర్ 13వ తేదీలోపు అమెజాన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే బెనిఫిట్ ఇదే!

దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ వేరియంట్ ఇప్పటకే 57 దేశాలను చుట్టేసింది. భారత్‌లోకి కూడా ప్రవేశించింది. ఇప్పటివరకు 20కిపైగా ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఒమిక్రాన్‌ వ్యాప్తి దేశంలో దడ పుట్టిస్తోంది.

Facebook Profile Trick : మీ FB ప్రొఫైల్ ఎవరు చూశారో ఇట్టే తెలుసుకోవచ్చు!..

సెకండ్‌ వేవ్‌ మిగిల్చిన నష్టాన్ని మర్చిపోక ముందే.. ఇక, థర్డ్‌ వేవ్‌ ముప్పు తప్పదన్న హెచ్చరికలు కలవర పెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందే. కరోనా నిబంధనలు పాటించాల్సిందే. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. అలాగే అర్హులందరూ తప్పకుండా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.