Anna Rambabu : గుడ్ బై.. వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంచలన నిర్ణయం

నన్ను, నా కుటుంబాన్ని కొందరు టార్గెట్ చేసి కించపరుస్తూ కులం పేరుతో కూడా దూషించారు. డబ్బులు తీసుకొని రాజకీయాలు చేసే వ్యక్తిని నేను కాదు.

Anna Rambabu : గుడ్ బై.. వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంచలన నిర్ణయం

Giddalur YCP MLA Anna Rambabu Sensational Decision

Updated On : December 27, 2023 / 6:37 PM IST

ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనారోగ్య కారణాల వల్ల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 2024 ఎన్నికల్లో బరిలో నిలబడటం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో గిద్దలూరు వైసీపీ అభ్యర్థిగా సీఎం జగన్ ఎవరిని నియమించినా అందరం కలిసి పని చేసి గెలిపించుకుందామని క్యాడర్ కు పిలుపునిచ్చారు అన్నా రాంబాబు. కాగా, తాను వైసీపీకీ రిజైన్ చేసి టీడీపీలో చేరబోతున్నట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

‘ఇప్పుడున్న రాజకీయాల్లో నేను ఇమడలేకపోతున్నా. నా ఆవేదనను పార్టీ పెద్దలు ఎందుకు పట్టించుకోలేదనే బాధ ఉంది. గత 34 ఏళ్లుగా ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట కుటుంబం ఈ జిల్లాకు చేసిందేమిటి..? రానున్న ఎన్నికల్లో మాగుంట కుటుంబాన్ని జిల్లా ప్రజలు ఆదరించొద్దు. మాగుంట ఓటమి కోసం జిల్లా అంతా పర్యటిస్తా. మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో మొదటి సారి నేను ఎమ్మెల్యే అయ్యాను.

Also Read : ఏపీలో ఈసారి గెలుపు ఎవరిది? టీడీపీ ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏవి?

నన్ను, నా కుటుంబాన్ని కొందరు టార్గెట్ చేసి కించపరుస్తూ కులం పేరుతో కూడా దూషించారు. డబ్బులు తీసుకొని రాజకీయాలు చేసే వ్యక్తిని నేను కాదు. నన్ను టార్గెట్ చేస్తూ కులం పేరుతో కొందరు దూషించినా జిల్లా రాజకీయ పెద్దలు కూడా పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. 2024లో నేను పోటీ చేయనని జగన్ వద్ద చెప్పా. కానీ ఆయన ఒప్పుకోలేదు. నేను పార్టీ మారను. జగన్ తోనే నా రాజకీయ ప్రయాణం’ అని అన్నా రాంబాబు తేల్చి చెప్పారు.

Also Read : వైఎస్ షర్మిల టీడీపీకి దగ్గర అవుతున్నారా? జగన్ సోదరి వ్యూహం ఏంటి?