Bhadrachalam Godavari : పోలవరం పూర్తైతే రామాలయం పరిస్థితి ఏంటి? భవిష్యత్‌లో భద్రాద్రి రాముడికి ముంపు ముప్పు తప్పదా?

భారీ వర్షాలతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గంటగంటకు వరద ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. కేవలం పైనుంచి వస్తున్న వరదలకే భద్రాద్రి రాములోరి చెంతకు వరద పోటెత్తితే.... మరి పోలవరం పూర్తైతే రామాలయం పరిస్థితి ఏంటి? వైకుంఠ రాముడికి వరద ముప్పు తప్పదా?

Bhadrachalam Godavari : పోలవరం పూర్తైతే రామాలయం పరిస్థితి ఏంటి? భవిష్యత్‌లో భద్రాద్రి రాముడికి ముంపు ముప్పు తప్పదా?

Polavaram Is Completed, The Condition Of Ram Temple

Updated On : July 15, 2022 / 11:02 AM IST

Bhadrachalam Godevari : భారీ వర్షాలతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గంటగంటకు వరద ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. కేవలం పైనుంచి వస్తున్న వరదలకే భద్రాద్రి రాములోరి చెంతకు వరద పోటెత్తితే…. మరి పోలవరం పూర్తైతే రామాలయం పరిస్థితి ఏంటి? వైకుంఠ రాముడికి వరద ముప్పు తప్పదా?

భద్రాద్రి రామాలయానికి ప్రమాదం పొంచివుందా?ఈపాటి వర్షాలకే వరద పోటు ఇలా ఉంటే… పోలవరం పూర్తైతే పరిస్థితి ఏంటి? భవిష్యత్‌లో భద్రాద్రికి ముప్పు తప్పదా?వరదలతో రాములోరి ఆనవాళ్లు మసకబారనున్నాయా?ఇదిగో ఇక్కడ చూడండి.. ఇదే భద్రాద్రి రాముడు కొలువైన ప్రదేశం. ముద్దుల సీతమ్మ వారితో మురిపాలు ఆడిన ప్రదేశం ఇదే. ఇదిగో ఇక్కడే సీతమ్మ నార చీర ఆరేసుకున్న ప్రాంతం అని చెప్పుకునే పవిత్రమైన ప్రదేశాలు ఇక కనిపించవా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఇంతటి ఘన చరిత్ర కలిగిన భద్రాద్రికి వరద గండం పొంచి ఉంది. అవును నిజమే… చరిత్రలో కనివీని ఎరుగని రీతిలో లక్షల క్యూసెక్కుల వరద నీటితో గోదావరి ఉగ్రరూపం దాల్చుతుండటమే ఇందుకు కారణం. పైనుంచి వస్తున్న వరదనీటికే భద్రాద్రి వద్ద వరద ఈ రేంజ్‌లో పోటెత్తితే… భవిష్యత్‌లో పోలవరం పూర్తైతే పెరగనున్న బ్యాక్‌ వాటర్‌ లెవల్‌ తో భద్రాద్రి టెంపుల్ పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

భద్రాచలం… దక్షిణ భారతదేశం తెలంగాణ రాష్ట్రంలోని పావన గోదావరి తీరాన వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం. మేరువు, మేనకల కుమారుడైన భద్రుడు శ్రీరామచంద్రునికి పరమ భక్తవరేణ్యుడు. అతని తపస్సుకు మెచ్చి శ్రీరాముడు అతనికి ఇచ్చిన వరం ప్రకారం… సీతారాములు ఇక్కడ వెలిశారని స్థలపురాణం చెబుతోంది. భద్రుడు గోదావరీ నదికి అభిముఖంగా ఒక ప్రదేశంలో పర్వత రూపంగా మారిపోతాడు. ఆ స్థలమే భద్రాచలం. తన హృదయ స్థానంలో రాముడు కొలువయిన ఆ పర్వతానికి భద్రాద్రి అనీ, ఆ స్థలానికి భద్రాచలం అనీ పేరు వచ్చింది. భద్రాద్రి శ్రీరామచంద్రుడ్ని భక్తులు ప్రేమగా వైకుంఠ రాముడని, చతుర్భుజ రాముడని, భద్రగిరి నారాయణుడని పిలుస్తారు. దక్షిణాది అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రికి ఎంతో ఘనప్రాశస్యం ఉంది.

దేశంలో ఎన్నో రామాలయాలు ఉన్నప్పటికీ… భద్రాద్రికి ఉన్న చరిత్ర ఎంతో ఘనమైనది. భద్రాద్రి రామాలయంలో కొలువుదీరిన రాములోరు చేతిలో శంకుచక్రాలు ఉన్నట్లుగా దేశంలోని ఏ ఆలయంలో ఉండవు. భద్రాద్రిలో శ్రీరాముడు శంకుచక్రాలు రివర్స్‌లో ఉంటాయి. సీతమ్మ రామయ్య పక్కన కాకుండా.. ఏకంగా ఆయన ఒడిలో కూర్చుని ఉంటుంది. ఇలాంటి విగ్రహం దేశంలోని మరే ఆలయంలోనూ లేదంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు శబరి ఇచ్చిన ఎంగిలిపండ్లను రాములోరు ఇక్కడే తిన్నారని స్థల పురాణం చెబుతోంది. దానికి గుర్తుగానే ఇక్కడి అడవుల్లో నుంచి వచ్చి గోదావరిలో కలిసే నది శబరి పేరుతోనే గుర్తింపు పొందింది.

ఏ రామాలయంలో ఆలయంలో చూసినా… సీత సమేత రామలక్ష్మణుల పక్కన హనుమంతుడు కొలువుదీరుతారు. కానీ భద్రాద్రిలో ఆ దృశ్యం మనకు కనిపించదు. ఆంజనేయుడు ప్రత్యేకంగా మరో ఆలయంలో దర్శనమిస్తారు. సీతారామలక్ష్మణులు ఈ ప్రాంతానికి వచ్చే సరికి ఆంజనేయుడు వారికి పరిచయం కాలేదు.. అందుకే.. గర్బగుడిలో హనుమంతుడి విగ్రహం ఉండదు.

భద్రాచలం పక్కనే ఉండే పర్ణశాలకు కూడా ఎంతో చరిత్ర ఉంది. సీతమ్మ నార చీర పర్ణశాలలోనే ఆరేసుకుందని చరిత్ర చెప్తోంది. వనవాసానికి వచ్చిన సీతారాములకు లక్ష్మణుడు అటవీ ప్రాంతంలో దొరికిన వెదురు కర్రలతో అందమైన కుటీరాన్ని నిర్మించాడు. ఆ కుటీరాన్నే మనం పర్ణశాలగా పిలుస్తాం. కొద్దిరోజుల పాటు ఆ పర్ణశాలలో సీతారాములు సంతోషంగా నివసించారు. పది తలల రావణాసూరుడు సీతమ్మ ఈ పర్ణశాల నుంచే లంకను ఎత్తుకెళ్లారని స్థలం ద్వారా తెలుస్తోంది. భద్రాచలం దగ్గర గోదారిలో 31 అడుగుల నీటిమట్టం వస్తే.. పర్ణశాల మునిగిపోతుంది. ఇప్పుడు పోలవరం పూర్తైతే.. ఎప్పుడూ భద్రాచలం దగ్గర 43 అడుగుల నీటిమట్టం ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. అదే జరిగితే.. పర్ణశాల ప్రాంతం జలగర్భంలోకి వెళ్లిపోవడం ఖాయం. ఇంతటి చరిత్ర కలిగిన భద్రాద్రికి వరద గండం పొంచి ఉండటంతో అటు రాములోరి భక్తులు… ఇటు భద్రాద్రి వాసులు ఆందోళన చెందుతున్నారు.