మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ : ప్రత్యేక షోలకు పచ్చ జెండా

  • Published By: madhu ,Published On : January 9, 2020 / 10:19 AM IST
మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ : ప్రత్యేక షోలకు పచ్చ జెండా

Updated On : January 9, 2020 / 10:19 AM IST

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. సంక్రాంతి పండుగ సందర్భంగా మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు ఫిల్మ్ 2020, జనవరి 11వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. అయితే…ఏపీ రాష్ట్రంలో ప్రత్యేక షోలకు అనుమతినివ్వాలని నిర్మాత అనీల్ సుంకర ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనికి సీఎం జగన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

 

2020, జనవరి 11వ తేదీ నుంచి జనవరి 17 వరకు ప్రత్యేక షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతి రోజు అదనంగా రెండు షోలు వేసుకొనే అవకాశం కల్పించింది. అంటే ప్రతి రోజు ఆరు షోలు అన్నమాట. మొత్తంగా వారం రోజుల పాటు అదనంగా రెండు షోలు ప్రదర్శించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన బంపర్ ఆఫర్‌తో మహేష్ బాబు అభిమానులకు పండుగే పండుగ. 

సరిలేరు నీకెవ్వరు సినిమాను అనిల్ రావిపూడి దర్వకత్వంలో తెరకెక్కింది. మహేష్ బాబు సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటించారు. చాలా సంవత్సరాల తరువాత విజయశాంతి ఈ సినిమా ద్వార రీ ఎంట్రీ ఇస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, అజయ్, సంగీత ముఖ్య పాత్రలు పోషించారు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో GMB ఎంటర్ టైన్ మెంట్, A.K. ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు.

 

దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అలరించాయి. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న సరిలేరు నీకెవ్వరు జనవరి 11న రిలీజ్ కాబోతోంది. 

Read More : పిల్లల మేనమామగా అడుగుతున్నా..రూ. 15 వేలల్లో రూ. 1000 ఇవ్వండి